గణతంత్ర వేడుకల్లో జనసైనికులకు అభయమిచ్చిన శ్రీమతి కాంతిశ్రీ

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం రణస్థలం మండలం కోస్టా పంచాయితీలో ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన నాయకురాలు శ్రీమతి సయ్యద్ కాంతిశ్రీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా 2022 వ ఎచ్చెర్ల నియోజకవర్గ జనసేన పార్టీ కెలెండర్ ను ఆవిష్కరించటానికి వచ్చారు. అయితే రణస్థలం మండలం జనసైనికులు, కోస్టా పంచాయితీ జనసైనికులు శ్రీమతి కాంతిశ్రీ కి పూలమాలలు వేసి ఘనంగా స్వాగతం పలికారు. అలాగే ఆ జంక్షన్ నుంచి ర్యాలీతో నడుచుకుంటూ వెళ్లి డా.బి.ఆర్ అంబేద్కర్ కి పూల దండలు వేసి నమస్కరించుకున్నారు. కాంతిశ్రీ మాట్లాడుతూ ఎచ్చెర్ల నియోజకవర్గంలో పార్టీ బలోపేతం కోసం నేను ఏమైనా చెయ్యటానికి ముందు ఉంటానని తెలియజేశారు. మన జనసైనికుల కుటుంబాలకు ఏ పార్టీ వాడైన బెదిరించిన, ఇంకా ఏమైనా అన్న నాకు ఒక ఫోన్ కాల్ తో తెలియజేయండి. మనం ఎంటో చూపిద్దాం అని కాంతిశ్రీ జనసైనికులకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి వచ్చిన జనసైనికులకు ధన్యవాదాలు తెలియజేశారు. అలాగే కాంతిశ్రీ చేతుల మీదగా కెలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది. ఈ సమావేశంలో కష్టాల్లో ఉన్నప్పుడు జనసేన గుర్తుకొస్తుంది రేపొద్దున ఓటేసే అప్పుడు కూడా జనసేన గుర్తు రావాలని కోరుకుంటున్నామని శ్రీకాకుళం జిల్లా భగత్ సింగ్ స్టూడెంట్స్ యూనియన్ లీడర్ కాకర్ల బాబాజీ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు లక్ష్మినాయుడు, లక్షణ్, శ్రీను, ప్రసాద్, శంకర్, దుర్గరావు, బాబాజీ, సూర్య, రాజారమేష్, అలాగే నాని, పవన్ జనసైనికులు పాల్గొన్నారు.