శ్రీమతి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి
నందిగామ నియోజకవర్గం, చందర్లపాడు మండలం, తొర్లపాడు గ్రామంలో జరిగిన నందిగామ నియోజకవర్గం ఎన్డీఏ కూటమి ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి తంగిరాల సౌమ్య ఎన్నికల ప్రచారంలో నందిగామ నియోజకవర్గం జనసేన పార్టీ సమన్వయకర్త శ్రీమతి తంబళ్ళపల్లి రమాదేవి జనసైనికులు వీర మహిళలతో కలిసి పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా తంబళ్ళపల్లి రమాదేవి మాట్లాడుతూ వైసీపీ ప్రవేశపెట్టిన మేనిఫెస్టోలో మెగా డీఎస్సీ గురించి గానీ, మద్యపాన నిషేధం గురించి గానీ లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పిన ఎన్నో అంశాలలో ఈ రెండు ప్రధానమైనవి. అందుకే వాటి ఊసే లేకుండా మేనిఫెస్టోని విడుదల చేసి మళ్లీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలను మోసం చేయడానికి సిద్ధం సభలు పెట్టి సిద్ధమయ్యారు. వైసీపీ పార్టీ ప్రభుత్వం స్థాపించిన నాటి నుండి గడిచిన ఐదు సంవత్సరాలలో రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులన్నింటినీ తాకట్టు పెట్టి పాలన సాగించారు. ఇప్పుడు సామాన్య ప్రజల ఆస్తులను తాకట్టు పెట్టడానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని అమలు చేయాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ అమలయితే మనది అని చెప్పుకునే మన భూమి భవిష్యత్తులో మనదో కాదో తెలియని అయోమయ స్థితిలో జీవించాల్సి ఉంటుంది. ఇలాంటి టైటిలింగ్ యాక్ట్ చాలా ప్రమాదకరమైనది. వైసీపీకి ఓటు వేయాలనుకునే ఆ పార్టీ కార్యకర్తలకు సానుభూతిపరులకు కూడా మేము ఒకటే తెలియజేస్తున్నాము, భవిష్యత్తులో వైసీపీ పార్టీ చేయబోయే ఎన్నో దుర్మార్గపు చర్యలకు మీరు కూడా భాగస్వాములు కాకండి అని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో నందిగామ నియోజకవర్గ జనసేన నాయకులు మండలాధ్యక్షులు, ఉప మండల అధ్యక్షులు, గ్రామాధ్యక్షులు, జనసైనికులు, పవన్ ఆర్మీ టీం వీర మహిళలు మరియు టిడిపి శ్రేణులు పాల్గొనడం జరిగింది.