అంబేద్కర్ వర్ధంతి వేడుకల్లో నందికొట్కూరు జనసేన
నందికొట్కూరు: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ వర్ధంతి వేడుకలు నందికొట్కూరు జనసేన పార్టీ కార్యాలయంలో ఘనంగా జరుపబడ్డాయి. ఈ కార్యక్రమంలో నల్లమల్ల రవికుమార్ మాట్లాడుతూ డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ మన దేశానికి చేసిన మేలు వలన నేడు అణగారిన వర్గాలతో పాటు అందరూ సంతోషంగా జీవితాలను గడుపుతున్నారు. ప్రభుత్వ విధివిధానాల్లో ప్రతి ఒక్కరూ సమానంగా పాల్గొంటున్నారు స్వేచ్ఛగా జీవితం గడుపుతున్నారు అని కొనియాడారు. పగడం శేషన్న మాట్లాడుతూ బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగాన్ని రచించి ఎంతో మేలు చేశారని కొనియాడారు. ఈ కార్యక్రమానికి కాకర్ల కిరణ్ కుమార్, రమణ, తదితర జనసైనికులు హాజరు కావడం జరిగింది.