బొడ్లపాడు గ్రామంలో ఎన్.డి.ఏ కూటమి ప్రచారం
ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా, పాలకొండ నియోజకవర్గం, బొడ్లపాడు గ్రామంలో శనివారం చివరి రోజు ఎలక్షన్స్ ప్రచారం చెయ్యడం జరిగింది. ప్రతి ఇంటిని డోర్ టూ డోర్ టచ్ చేసి కూటమి ప్రభుత్వం పధకాలు, మేనిఫెస్టో ప్రజలుకి వివరిస్తూ పాలకొండ నియోజకవర్గం టీడీపీ బీజేపీ కూటమి బలపరిచిన జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి నిమ్మక జయకృష్ణ గారు గుర్తు గాజు గ్లాస్ గుర్తుకి అరుకు పార్లమెంట్ ఎంపీ కొత్తపల్లి గీతమ్మ గారి గుర్తు కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి బొడ్లపాడు గ్రామంలో జనసేన జయకృష్ణ గారికి 90% మెజారిటీ ఇవ్వాలి అని కోరడమైనది. ఈ కార్యక్రమం భాగంలో వైస్సార్సీపీ కార్యకర్తలు అభిమానులు జనసేన పార్టీలోకి రావడం జరిగింది. వారికి తెలుగుదేశం అరుకు పార్లమెంట్ జనరల్ సెక్రటరీ పొన్నాడ నాగేశ్వరావు, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి జనసేన జానీ ఆధ్వర్యంలో సుమారు 70 కుటుంబాలు పార్టీ జాయిన్ అవ్వడం జరిగింది. బొడ్లపాడు గ్రామంలో కేవలం 10 కుటుంబాలు మాత్రమే వైస్సార్సీపీలో ఉండటం చూస్తే భవిష్యత్తులో వైస్సార్సీపీ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మరి ఇక కనిపించదు అని స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ లో ఉమ్మడి ప్రభుత్వం పాలకొండలో జనసేన అభ్యర్థి గెలవడం తథ్యం అని మెజారిటీ ప్రజలు అభిప్రాయం. ఈ కార్యక్రమంలో వైస్సార్సీపీ వైస్ ప్రెసిడెంట్ తమరాపు చిన్నారావు, వార్డ్ నంబర్స్ పొన్నాడ శంకర్ రావు, పోతల సంతోష్, బొత్స రామప్పడు, మడపల శంకర్ రావు, గ్రామ టీడీపీ సీనియర్ నాయుకులు పొన్నాడ చిన్నంనాయుడు, పొన్నాడ రామకృష్ణ, రౌతు సూర్యనారాయణ, దాసరి వెంకటనాయుడు, యువ నాయుకులు పొన్నాడ రామకృష్ణ, బండి చక్రవర్తి, నివర్తి నాగభూషణం, పూడి తిరుపతి రావు, కారు బొంతు బాలకృష్ణ, పూడి సతీష్, కారు విజయరావు సంతోష్, పూడి రాంబాబు టీడీపీ, జనసేన కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.