SBI అప్రెంటీస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల..

దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు… స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్‌బీఐ)కు చెందిన ముంబయిలోని సెంట్రల్‌ రిక్రూట్‌మెంట్‌ అండ్‌ ప్రమోషన్‌ విభాగం… దేశవ్యాప్తంగా అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

► మొత్తం అప్రెంటిస్‌ ఖాళీల సంఖ్య: 6100

► తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటిస్‌ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125.

► అప్రెంటిస్‌ శిక్షణ వ్యవధి: ఒక ఏడాది.

► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్‌స్టిట్యూట్‌ నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత ఉండాలి.

► వయసు: 31.10.2020 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో

సడలింపు లభిస్తుంది.

► స్టయిపెండ్‌: అప్రెంటిస్‌ శిక్షణ కాలం ఏడాది పాటు నెలకు రూ.15000 స్టయిపెండ్‌ లభిస్తుంది. ఇతర ఎలాంటి అలవెన్సులు/ప్రయోజనాలు ఉండవు.

► ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, మెడికల్‌ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది.

► రాత పరీక్ష ఇలా: ఎస్‌బీఐ అప్రెంటిస్‌ రాత పరీక్ష ఆన్‌లైన్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు-100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. జనరల్‌/ఫైనాన్షియల్‌ అవేర్‌నెస్‌-25 ప్రశ్నలు-25 మార్కులు, జనరల్‌ ఇంగ్లిష్‌-25 ప్రశ్నలు-25 మార్కులు, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్‌-25 ప్రశ్నలు-25 మార్కులు, రీజనింగ్‌ ఎబిలిటీ అండ్‌ కంప్యూటర్‌ అప్టిట్యూడ్‌-25 ప్రశ్నలు-25 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట(60 నిమిషాలు). ప్రతి విభాగానికి 15 నిమిషాలు కేటాయించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది.

► దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

► ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.07.2021

► ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021

► వెబ్‌సైట్‌: https://bank.sbi/web/careers, https://apprenticeshipindia.org