గుడ్ మార్నింగ్ సీఎం సార్ డిజిటల్ క్యాంపెయిన్ లో పాలకొండ జనసేన

పాలకొండ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి పిలుపుమేరకు పాలకొండ నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు గర్భాన సత్తిబాబు నాయకత్వంలో #GoodMorningCMSir అనే హ్యాష్ టాగ్ తో శుక్రవారం, జనసేన డిజిటల్ క్యాంపెయిన్ పాలకొండ నియోజకవర్గంలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జనసేన నాయకులు గర్భాపు నరేంద్ర మాట్లాడుతూ పాలకొండ ఏరియా ఆసుపత్రి ప్రధాన రహదారి గుంతలతో చాలా అధ్వానంగా ఉందని, అలాగే గోతుల మధ్య రోడ్లు వెతుక్కోవలసిన పరిస్థితి ఈవేళ రాష్ట్రంలో కనిపిస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఈ సమస్యలపై దృష్టి సారించి చర్యలు చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు డొంక శివప్రసాద్, సతివాడ వెంకటరమణ, వండాన సాయి కిరణ్, శేకర్, గెంబాలీ సంతుష్, హరి, యోగేష్, రామకృష్ణ తదితురులు జనసైనికులు పాల్గొన్నారు.