పార్వతీపురం జనసేన విస్తృత స్థాయి సమావేశం

పార్వతీపురం నియోజకవర్గ నాయకులు సీతానగరం పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో పార్వతీపురం, సీతానగరం, బల్జిపేట మండలాల నుంచి అధిక సంఖ్యలో నాయకులు, జనసైనికులు మరియు వీర మహిళలలు పాల్గొనడం జరిగింది. వైసీపీ అరాచకాలను అడ్డుకోవడంలోనూ, ప్రజా సమస్యలపై పోరాడటంలోనూ, పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేయడంలోనూ, వైసీపీ గూండాలను తరిమి కొట్టడంలోను మనదంతా ఒకే మాట – ఒకే బాట అనే నినాదంతో ముందుకు వెళ్లాలని తీర్మానం చెయ్యడం జరిగింది. మనస్పర్థలకు చోటు లేకుండా ఐక్యమత్యంతో అంచెలంచెలుగా ఎదిగి ప్రణాళిక బద్దంగా పని చేసి వ్యూహాత్మకంగా ముందుకు అడుగులు వేసి పార్వతీపురం నియోజకవర్గంలో జనసేనాని గెలుపించుకొని పవన్ కళ్యాణ్ కి బహుమతిగా ఇద్దాం. పవన్ కళ్యాణ్ ని ముఖ్యమంత్రిని చేద్ధాం. అలాగే కొద్ది రోజులుగా ఈ రౌడీ వైసీపీ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ పర్యటనలను అడ్డుకోవడం, ఆయనపై హత్యా ప్రయత్నాలు జరుగుతున్న మౌనంగా ఉండటం, పవన్ కళ్యాణ్ కి అండగా నిలిచిన ఇప్పటం గ్రామ ప్రజల ఇళ్ళను కక్షపూరితంగా కుల్చేయడం, వాళ్ళకి అండగా నిలవడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ ని అడ్డుకోవడంపై రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ధ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నిరసన తెలుపుతూ నినాదాలు చెయ్యడం జరిగింది. మా ఆహ్వానం మేరకు పార్టీ మీద ఉన్న ప్రేమతో నియోజకవర్గ నలుమూలల నుంచి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని ఇంతటి విజయవంతం చేసిన ప్రతీ ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీతానగరం మండల నాయకులు రమేష్, జై శంకర్, సత్యన్నారాయణ, శంకర్, శ్రీను, వెంకటరమణ, ప్రసాద్, కిశోర్, భాస్కర్, పార్వతీపురం మండల నాయకులు విశ్వేశ్వరరావు, గణేష్, శ్రీను, శంకర్, మని మరియు వీరమహిళలు లక్ష్మి, మని, గోవిందమ్మ మరియు జనసైనికులు పాల్గొన్నారు.