అగ్ని ప్రమాద బాదితులకు అండగా పేడాడ రామ్మోహన్

ఆమదాలవలస నియోజకవర్గం, పొందూరు మండలం, బాణం పంచాయతీ, బాణం గ్రామానికి చెందిన అగత సోములు, అగత రమణ నివసిస్తున్న రెండు పూరిల్లు అగ్ని ప్రమాదానికి గురై పూర్తిగా కాలిపోయాయి. ఈ ప్రమాదంలో వారు పండించుకున్న సుమారు 5 లక్షల రూపాయలు విలువైన జీడి పిక్కలు పూర్తిగా అగ్నికి బూడిద అయిపోయాయి. అలాగే వ్యవసాయ నిమిత్తం దాచుకున్న రెండు లక్షల రూపాయల విలువ గల మోటార్ పంపులు మరియు బీరువాలో దాచుకున్న మూడు తులాల బంగారం, మూడు లక్షల రూపాయలు డబ్బులు అగ్నికి ఆహుతి కావడంతో ఆ పేదవారు రోడ్డును పడిపోయారు. ఈ విషయం తెలుసుకున్న జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి పేడాడ రామ్మోహన్ రావు హుటాహుటిన ఆ గ్రామానికి బయలుదేరి 50 కేజీల బియ్యం మరియు నిత్యవసర సరుకులు మానవతా దృక్పథంతో సహాయం చేశారు. 20వ శతాబ్దంలో కూడా ఇంకా పూరి గుడిసెల్లో ప్రజలు నివసిస్తుండడం చూసి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార పార్టీ చెబుతున్న పథకాలు ఏవి కూడా పేద ప్రజలకు అందడం లేదని ధ్వజమెత్తారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరపున రావలసిన సాయం వచ్చేంతవరకు ఆ కుటుంబం తరఫున పోరాటం చేస్తానని మాట ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పొందూరు మండల నాయకులు అసిరి నాయుడు, చిన్నం నాయుడు, రమణ, సూర్య, బాబురావు, భాస్కర రావు, సిమ్మి నాయుడు, సురేష్, సింహాచలం మరియు పెద్ద సంఖ్యలో గ్రామ జనసైనికులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.