అమరావతి రైతుల మహా పాదయాత్రకి మద్ధతు తెలిపిన పెడన జనసేన

పెడన, అమరావతి రాజధాని రైతులు చేస్తున్న దీక్ష 1000 రోజులు అయిన సందర్భంగా “అమరావతి నుండి అరసవల్లి పాదయాత్ర 2.0” ను అమరావతి నుండి అరసవల్లి వరకు రైతులు పాదయాత్ర మొదలు పెట్టడం జరిగింది. ఈ పాదయాత్ర మొత్తం 60 రోజులలో పూర్తి కానుంది. ఈ పాదయాత్ర శుక్రవారం పెడన నియోజకవర్గం చేరుకోవడంతో పెడన జనసేన నాయకులు రాజధాని రైతులకు ఘనస్వాగతం పలికి వారికి మద్ధతుగా పాదయాత్రలో పాల్గొనడం జరిగింది. ఈ పాదయాత్రలో రైతులకు జనసేన శ్రేణులకు పెడన జనసేన మజ్జిగ ప్యాకెట్లను పంచడం జరిగింది. ఈ కార్యక్రమంలో పెడన జనసేన నాయకులు ఎస్ వి బాబు, పెడన జనసేన నాయకులు మరియు జనసైనికులు భారీ ఎత్తున పాల్గొన్నారు.