ఓటు ద్వారా ప్రజలు చైతన్యం చాటారు
ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగించారు
కూటమి విజయం ఖాయమైంది
జనసేన సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్ పెంటేల బాలాజి
చిలకలూరిపేట: రాష్ట్రంలో రాక్షస పాలన అంత మొందించాలని, భావిభవిష్యత్తు బంగారు మయం కావాలని, కూటమి పాలన రావాలని ఆశించి సూదీర ప్రాంతాల నుంచి వచ్చి తమ అమూల్యమైన ఓటు వేసిన ఓటర్లకు కృతజ్ఞతలు తెలియచేసిన జనసేన సెంట్రెల్ ఆంధ్ర కో-కన్వీనర్, ఉంగుటూరు నియోజకవర్గ పరిశీలకులు పెంటేల బాలాజి. మంగళవారం తన కార్యాలయంలో బాలాజి విలేకర్ల తో మాట్లాడారు. ఓటర్లలో చైతన్యం వెల్లువెత్తడం, ఉదయం నుంచే పోలింగ్ కేంద్రాలు తెరిచే సమయానికే ఓటర్లు బారులు తీరడం. గంటల తరబడి ఓపికగా క్యూలైన్లలో నిలబడి ఉత్సాహంగా ఓటేయడం. రాత్రి 10 గంటల సమయానికి కూడా అనేక చోట్ల పెద్ద క్యూలు ఉండటం. యువత పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనడం. ఇతర రాష్ట్రాల నుంచి ఆరు లక్షలకుపైగా ఓటర్లు తరలి రావడం వంటి పరిణామాలు రానున్న కూటమి ప్రభుత్వానికి భారీ విజయాన్ని సాధించి పెడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఉద్యోగులు పోస్టల్ ఓటింగ్ ద్వారా ఇదే తరహ చైతన్యాన్ని ప్రదర్శించారని గుర్తు చేశారు. ప్రభుత్వంపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకత, ఉద్యోగాలు, ఉపాధిలేక యువత తీవ్ర నిస్పృహలో ఉండటం, ఉద్యోగ, వ్యాపార వర్గాల్లో ప్రభుత్వంపై గూడుకట్టుకున్న అసంతృప్తి వంటివి కూటమి విజయానికి దోహదపడనున్నాయని తెలిపారు. రాష్ట్ర ప్రజలు ఓటేసి, ప్రజాస్వామ్య స్ఫూర్తి చాటిచెప్పారని తెలిపారు ప్రజలు అభివృద్ధి సంక్షేమాన్ని కోరుతున్నారని దీని ద్వారా తేటతెల్లమైందని వ్యాఖ్యానించారు. వైసీసీ ఆరాచక శక్తుల వికృత క్రీడ. రాష్ట్రం ఆరాచక శక్తులకు రాజ్యంగా మారిందని, ఎన్నికల సమయంలో కొనసాగిన భారీ హింసతో ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యందని బాలాజి మండి పడ్డారు. ఎన్నికల వేళ వైసీపీ రాష్ట్రవ్యాప్తంగా దౌర్జన్యకాండకు పాల్పడిందని విమర్శించారు. ఐదేళ్లపాటు దాడులు, ప్రశ్నించిన వారిపై కేసులు, ఎన్నో అరాచకాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన వైసీపీ. రక్తదాహం ఇంకా తీరలేదన్నట్లు ఎన్నికల్లో మరింత పెట్రేగిపోయిందన్నారు. తెనాలి, మాచర్ల, అనంతపురం, నరసరావుపేట ప్రాంతాల్లో జరిగిన ఘటనలకు బాధ్యులైన వారిని వెంటనే గృహనిర్బంధంలోకి తీసుకోవాలని, వారిపై కేసులు నమోదు చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్‌కుమార్ మీనా స్వయంగా ఆదేశించిన విషయాన్ని గమనిస్తే పరిస్తితి ఎంతగా అదుపుతప్పిందో అర్ధమౌతుందన్నారు. అరాచక పాలనతో ప్రజా వ్యతిరేకతను మూటగట్టుకున్న వైసీసీ. మళ్లీ పీఠమెక్కేందుకు అడ్డదారులనే ఎంచుకుందని, పచ్చనోటు. దొంగ ఓటు. మద్యం ప్రవాహం. ఇతరత్రా తాయిలాలతో అధికార పార్టీ ప్రలోభాల వల విసిరినా. ఓటు ద్వారా ప్రజలు చైతన్యం చాటారని వివరించారు.