అక్రమ మైనింగ్ పై తాసిల్దార్ కు జనసేన వినతి పత్రం

కొండేపి నియోజకవర్గం: ప్రకాశం జిల్లా, సింగరాయకొండ మండలం, శానంపూడి గ్రామంలో పెద్దదరువు దగ్గర జరుగుతున్న అక్రమ మైనింగ్ చేస్తున్న ఫణీంద్ర పై కేసు నమోదు చేసి.. ఎంత మేరకు ఆక్రమం మైనింగ్ జరుగుతుందో నెగ్గు తేల్చాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేయడం జరిగింది. అదేవిదంగా ఫణింద్ర అనే వ్యక్తి ఉన్న ప్రదేశాన్ని పరిశీలించి అక్రమంగా ఎంత ప్రభుత్వ భూమి ఉన్నదో కూడా నిగ్గు తేల్చి.. శానంపూడి గ్రామంలో ప్రభుత్వ భూములు ఎక్కడెక్కడ ఉన్నాయి వీటిని పరిశీలించి వాటికి సంబంధించిన సర్వే నంబర్లు వేసి ఎత్తైన రాళ్లతో మార్కింగ్ చేసి ప్రజలకు అవగాహన కల్పించి.. ఈ హద్దురాలలో ఎవరైనా అక్రమ మైనింగ్ చేసినట్లయితే ఎవరైనా పై అధికారులకు తెలియజేయవలెను అని, ఇనుప బోర్డులు పెద్ద ఎత్తులో ఉండే విధంగా నిర్మించాలని తెలియజేసారు. ఆదివారం జరిగిన అక్రమ మైనింగ్ ప్రదేశాన్ని పరిశీలించి దాని సర్వే నెంబరు ఎన్ని ఎకరాల భూమి అది ప్రభుత్వ భూమి లేక ఇతరుల ఎవరికైనా పట్టాలిచ్చారా వాటి హద్దులను తెలియజేసి అక్రమంగా పాస్ పుస్తకాలు పొందిన వారిపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా సింగరాయకొండ మండలంలో అక్రమం మైనింగ్ యదేచ్చుగా జరుగుతుంది, మరియు మండలంలో ప్రభుత్వ భూమి అక్రమాలకు గురి అయినది, వీటన్నిటిని పరిశీలించి వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయించి ప్రభుత్వ భూములను కాపాడవలెను అని జనసేన పార్టీ నుండి డిమాండ్ చేయడం జరిగింది. దీనిపై స్పందించిన తహసిల్దార్ వెంటనే చర్యలు చేపడతామని హామీ ఇవ్వడం జరిగినది. ఈ కార్యక్రమంలో సింగరాయకొండ మండల అధ్యక్షులు ఐనా బత్తిన రాజేష్, జనసేన నాయకులు కాసుల శ్రీనివాస్, సంకె నాగరాజు, గుంటుపల్లి శ్రీనివాసరావు, గ్రౌండ్ లెవెల్ ప్రోగ్రాం కేశవరావు మరియు జన సైనికులు మరియు వీర మహిళలలు పాల్గొన్నారు.