తూర్పు కాపుల సమస్యలపై వినతి పత్రం
గుంటూరు: గుంటూరు నగరం జనసేన పార్టీ సర్వసభ సమావేశం మంగళవారం ఏర్పాటు జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను గుంటూరు జిల్లా తూర్పు కాపు సంఘం తరపున కలవడం జరిగింది. తూర్పు కాపు సమస్యలు అయిన ఒబిసి రిజర్వేషన్ గురించి బిసిడిఎ లో మార్పు తూర్పు కాపు కార్పోరేషన్ గురించి అర్దిక సహాయ సామాజిక భవనం గురించి తదితర అంశాలు గురించి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు నగరం జనసేన అధ్యక్షుడు నేరేళ్ళ సురేష్, గుంటూరు జిల్లా అధ్యక్షుడు అబోతుల రామారావు, నగరం తూరుపు కాపు జనరల్ సెక్రటరీ వంజరపు దేవి ప్రసాద్, రాష్ట్ర తూర్పు కాపు ఉపాధ్యక్షుడు కొత్తకోటి ప్రసాదు మరియు తెనాలి తూర్పు కాపు సంఘం పెరుగు కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.