విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ ని డిమాండ్ చేసిన పోతిన మహేష్

  • అక్రమ నిర్మాణాలు ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నాయకులపై మరియు అధికారులపై కేసులు నమోదు చేయాలి.
  • రింగ్ గా ఏర్పడి నగరంలో అక్రమ నిర్మాణాలపై యదేచ్ఛగా దోచుకుంటున్నారు.
  • 42వ డివిజన్లో నిన్న జరిగిన ఘటన అవినీతి ఏ స్థాయిలో జరుగుతుందో అర్థమవుతుంది.
  • మేయర్ భర్త మరియు ఏజెంట్ ల పేర్లు ప్రస్తావన వచ్చింది.
  • దీనిపై విజవాడ మున్సిపల్ కమిషనర్ కి కంప్లైంట్లు పెట్టాలి.
  • జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్

విజయవాడ, నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జ్ పోతిన వెంకట మహేష్ తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో మాట్లాడుతూ విజయవాడ నగరంలో కార్పొరేషన్ ఖజానాకి గండి కొడుతూ అక్రమ నిర్మాణాలను యదేచ్చగా ప్రోత్సహిస్తున్న అధికార పార్టీ నాయకులపై మరియు అధికారులపై కేసులు నమోదు చేయాలని విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ ని డిమాండ్ చేసిన జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు పశ్చిమ నియోజకవర్గం ఇన్చార్జి పోతిన వెంకట మహేష్. ఏసీబీ వారి దాడులు జరిగిన తర్వాత వారి దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా తప్పక కేసులు నమోదు చేయాలని రింగుగా ఏర్పడి కార్పొరేషన్ కు గండి కొడుతూ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని నిన్న 42 డివిజన్లో జరిగిన ఘటనలో బిల్డింగ్ యజమాని బహిరంగంగానే స్థానిక కార్పొరేటర్ మేయర్ భర్త వారి పీఏ రజిని పేర్లను ప్రస్తావించారని, అధికారులు ఉండగానే అంతా బహిరంగంగా పేర్లు ప్రస్తావిస్తున్నారు అంటే అవినీతి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు అని, చెడ్డి గ్యాంగ్ లాగా విఎంసి లో కూడా ఒక గ్యాంగ్ తయారైందని, రెండు నెలల కిందట హ్యూమన్ రైట్స్ పేరుత అక్రమ నిర్మాణాలు చేయించిన వారిపై కేసులు నమోదు చేశారని ఇందులో ప్రత్యేకంగా భవన యజమానులు పిలిపించే కంప్లైంట్ లు పెట్టించారని అదేవిధంగా నేను కూడా విజయవాడ నగరంలో జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై విజయవాడ పోలీస్ కమిషనర్ వారు ప్రత్యేక దృష్టి సారించి వీరిపై కేసులు నమోదు చేసి నగర అభివృద్ధికి దోహదపడలని అభ్యర్థిస్తున్నామని చిన్నచిన్న చేపల మీద కాకుండా తిమింగలాలపై ప్రత్యేక దృష్టి విజయవాడ నగరం మున్సిపల్ కమిషనర్ దృష్టి సారించాలని గతంలో జనసేన పార్టీ విజయవాడ తరఫున అక్రమ నిర్మాణాలపై అవినీతి నిరోధశాఖకు మరియు విజిలెన్స్ వారికి కంప్లైంట్ పెట్టామని, పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ కొండపల్లి బుజ్జి ఆంజనేయ రెడ్డి కాజా ఒకరింగుగా ఏర్పడ్డారని మరొక రింగుగా మేయర్ భర్త మరొక ప్రైవేట్ బిల్డింగ్ కాంట్రాక్టర్ ఉన్నారన్నారు. తొందర్లో అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకపోతే కార్పొరేషన్ ముట్టడి తేదీ ప్రకటిస్తామని తెలియజేశారు.