పెంచిన విద్యుత్ చార్జిలను తగ్గించాలని ప్రకాశం జిల్లా జనసేన వినతిపత్రం

ప్రకాశం జిల్లా, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ఆదేశాలు మేరకు ఆంధ్రప్రదేశ్ లో పెంచిన విద్యుత్ ఛార్జిలకు నిరసనగా శుక్రవారం అద్దంకి బస్టాండ్ నుండి ర్యాలీగా.. వెళ్ళి అధికారులు అందుబాటులో లేకపోవటం వలన కలెక్టర్ ఆఫీస్ లో ఏఓ కీ వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్బంగా ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ రియాజ్ మాట్లాడుతూ.. ముద్దులు పెట్టుకుంటూ రాష్ట్రమంతా పాదయాత్ర చేసి.. ఒక్క చాన్స్ అంటూ అధికారంలోకి వచ్చాక పిడి గుద్దులు గుద్దుతున్నారని.. తాజాగా జగనన్న కరెంట్ షాక్ రత్నంతో ప్రజల నెత్తిన భారీగా చార్జీలు పెంచి బాదుడని జిల్లా అధ్యక్షులు రియాజ్ విమర్శించారు. ఇసుక బాదుడు, మద్యం బాదుడు, చెత్త పన్ను బాదుడు, ఆస్తి పన్ను, పాత ఇళ్లపై కొత్తగా ఓటీఎస్‌ బాదుడు, రైతులపై నీటి పన్ను బాదుడు, నిత్యావసర వస్తువులపై బాదుడు, ఇప్పడు కరెంటు ఛార్జీలపై బాదుతూ.. ముఖ్యమంత్రి జగన్ ప్రజలని దోచుకుంటున్నారని విమర్శించారు.పెంచిన కరెంటు చార్జీలలో పేద, మధ్యతరగతి ప్రజలపై విపరీతమైన భారంపడిందని, అసలే రాష్ట్రంలోకి కొత్త పరిశ్రమలు రావడం లేదని, పెంచిన కరెంట్ చార్జీలతో ఉన్న పరిశ్రమలు మూత పడేలా వున్నాయీ.. దీనితో పనిచేసుకునే వారు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందన్నారు. రెండు వందల ఉచిత విద్యుత్ హామీ ఏమైంది అని విమర్శించారు.
ఈ సందర్బంగా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెదపూడి విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఫ్యాను గుర్తుకు ఓటు వేసిన పాపానికి ఇళ్లలో ఫ్యాన్లు తిరగని పరిస్థితి రాష్ట్ర ప్రజలకు దాపురించింది.. విద్యుత్ చార్జీలు బాదుడే బాదుడు, ఒకవైపు పన్నులు పెంచారు, మరోవైపు విద్యుత్ చార్జీలు పెంచారు, నిత్యావసర ధరలు ఆకాశాన్నంటుతున్నాయి, పాదయాత్రలో ఎన్నికలకు ముందు రైతులకు నిరంతరాయంగా 9 గంటలు నాణ్యమైన కరెంటు ఇస్తామని చెప్పారు, ఇప్పుడు ఇస్తున్నారా లో వోల్టేజ్ ప్రాబ్లం వల్ల రైతులు మోటార్లు కాలిపోయి.. అదనపు భారం రైతుల మీదపడి అనేక ఇబ్బందులకు గురౌతున్నారు. గృహ అవసరాలకు కూడా సక్రమంగా కరెంటు ఇవ్వట్లేదు, రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దాదాపు 5 లక్షల కోట్లు అప్పు చేసింది.. అప్పు చేసిన డబ్బంతా ఎక్కడికి వెళ్తుంది? ఎందుకు మరలా అదనంగా విద్యుత్ చార్జీలు పెంచుతున్నారు.. తక్షణమే విద్యుత్ చార్జీలు తగ్గించకపోతే జనసేన పార్టీ తరపున పెద్ద ఎత్తున ప్రజల తరఫున ఉద్యమం చేస్తాం అని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో గిద్దలూరు జనసేన పార్టీ ఇంచార్జ్ బెల్లంకొండ సాయి బాబా, యర్రగొండపాలెం జనసేన పార్టీ ఇంచార్జ్ పాకనాటి గౌతమ్ రాజ్, కందుకూరు జనసేన పార్టీ ఇంచార్జ్ పులి మల్లికార్జున, జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాయపాటి అరుణ, ఒంగోలు నగర జనసేన పార్టీ అధ్యక్షులు మలగా రమేష్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి చీకటి వంశీ, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ కార్యదర్శులు కళ్యాణ్ ముత్యాల, రాయని రమేష్, మేడ రమేష్, బొందిల శ్రీదేవి, లంక నరసింహ రావు, రహమతుల్లా, అంకోజీ రావ్, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ లీగల్ సెల్ కార్యదర్శి వరికూటి నాగరాజు, రాష్ట్ర కార్యక్రమాల కార్యనిర్వహణ కార్యదర్శి బత్తుల రామకృష్ణ, రాష్ట్ర మత్స్యకార విభాగం నాయకులు రాజు, ప్రకాశం జిల్లా జనసేన పార్టీ సంయుక్త కార్యదర్శి దొరస్వామి నాయుడు, ఇంతియాజ్, కాల్వ బాలరంగయ్య, ఒంగోలు నగర జనసేన పార్టీ ఉపాధ్యక్షులు పిల్లి రాజేష్, ఒంగోలు నగర జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శులు దండే అనిల్, ఆర్ కె నాయుడు ముత్యాల, పల్ల ప్రమీల, సీనియర్ నాయకురాలు కోసూరి శిరీష, మండల అధ్యక్షులు, జనసేన నాయకులు, కార్యకర్తలు, వీర మహిళలు తదితరులు పాల్గొన్నారు.