ఆస్తి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ జనసేన నిరసన
అనంతపురం, పెంచిన ఆస్తి పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ గురువారం జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు టిసి వరుణ్ ఆదేశాల మేరకు నగర అధ్యక్షులు పొదిలి బాబురావు ఆధ్వర్యంలో గురువారం తలపెట్టిన నగరపాలక సంస్థ ముట్టడి విజయవంతం అయింది. జనసేన నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావడంతో నగర ప్రజలు చిరు వ్యాపారులు, తోపుడు బండి వ్యాపారులు కార్యక్రమంలో పాల్గొని తమ సంఘీభావం తెలిపారు. అయితే గత రెండు సంవత్సరాలుగా కరోనా నేపథ్యంలో అనంత నగర ప్రజల ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా అయ్యాయి ఇలాంటి తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం ప్రజలపై పన్ను వడ్డీ భారాన్ని మోపడాన్ని జనసేన పార్టీ తరఫున వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.
డిమాండ్స్ :-
1) ఆస్తి విలువ ఆధారిత విలువ పన్నును తగ్గించాలి.
2) పన్నుపై వడ్డీని ఒక రూపాయి లోపు పరిమితం చేయాలి.
3) కరోనా కరువు నేపథ్యంలో పన్ను ఒత్తిడిని తగ్గించాలి.
4) సచివాలయ వాలెంటరీ సంస్థ ద్వారా పదే పదే పన్నులు కట్టమని ప్రజలను వేధించడం.
5) పన్నుల విషయంలో పార్టీల పక్షపాతం సబబు కాదు.
6) అభివృద్ధి చేయకుండా ప్రజలపై భారాలు మోపడం హేయమైన చర్య.
ఇప్పటికైనా నగరపాలక సంస్థ అభివృద్ధిపై దృష్టి సారించకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరిస్తున్నాం. భవిష్యత్తులో జనసేన పార్టీ ఈ నిరంకుశ వైసీపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతుంది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని నగర ప్రజలకు కాస్త వెసులుబాటు కల్పించాలని జనసేన పార్టీ తరఫున తెలియజేస్తున్నాము. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు, జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు, రాయలసీమ ప్రాంతీయ కమిటీ సభ్యులు మరియు అర్బన్ నాయకులు, వీరమహిళలు రూప మారిశెట్టి, జయమ్మ తదితరులు పాల్గొన్నారు.