రాజమహేంద్రవరం జనసేన క్రికెట్ టోర్నమెంట్ 2022

రాజమహేంద్రవరం, స్థానిక మున్సిపల్ కాలనీ గ్రౌండ్ నందు బుధవారం ఉదయం 10 గంటలకు క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభమయింది. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా తూర్పుగోదావరి జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ కందుల దుర్గేష్, రాజమహేంద్రవరం జనసేన పార్టీ నగర ఇంచార్జ్ వర్యులు శ్రీ అనుశ్రీ సత్యనారాయణ, జనసేన పార్టీ రాష్ట్ర నాయకులు శ్రీ వై. శ్రీనివాస్, జనసేన పార్టీ నాయకులు శ్రీ దాసరి గుర్నాథం వారి చేతుల మీదుగా ప్రారంభం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా కార్యదర్శి శ్రీ జామి సత్యనారాయణ, జిల్లా సంయుక్త కార్యదర్శులు వై డి ప్రసాద్, గడ్డం నాగరాజు, జనసేన నాయకులు ప్రకాష్, బాషా, శ్యామ్, ముమ్మడి నాగరాజు, పైడ్రాజు, వీరబాబు, బుల్లి, ధర్మరాజు, టాగూరు, రాంబాబు, M.S.రాజు, నాగన్న, ప్రసాద్ జనసేన నాయకులు, వీరమహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.