కొండపల్లి మున్సిపాలిటీ జనసేన పార్టీ ఆధ్వర్యంలో రంజాన్ వేడుకలు

కొండపల్లి మున్సిపాలిటీ లో రంజాన్ పండుగ సందర్బంగా జనసేన పార్టీ నాయకులు అక్కల రామమోహన్ (గాంధీ) ముస్లిం సోదరులను కలిసి వారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియపరచి వారి కుటుంబాలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడిని ప్రార్ధించడం జరిగింది.

ఈ సందర్బంగా యతిరాజుల ప్రవీణ్ ఆధ్వర్యంలో అక్కల రామమోహన్ రావు (గాంధీ) చేతులమీదుగా పండ్లు మరియు స్వీట్స్ పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు అక్కల సత్యనారాయణ, రాగాల నాని, సామల సుజాత, సిరిపురం సురేష్, రామాంజనేయులు, పగిడిపల్లి వెంకట్, ఎరుబండి నరసింహారావు, రమేష్, మరియు ముస్లిం మత గురువులు, పెద్దలు తదితరులు పాల్గొన్నారు..