అన్నమయ్య జిల్లా,కలెక్టర్ జాయింట్ కలెక్టర్ కి వినతిపత్రం అందచేసిన రామశ్రీనివాస్

రాజంపేట: గురువారం మధ్యాహ్నం అన్నమయ్య జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్ కి జనసేన పార్టీ నాయకులు రామ శ్రీనివాస్ వినతిపత్రం ఇచ్చి ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా మరియు టి.సుండుపల్లె మండల పరిధిలో రోడ్లు చాలా అద్వాన్నంగా వున్నాయి. దీని వలన వాహనదారులు అనేక ఇబ్బందులు పడటమే కాకుండా అనేక ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి. దీని వలన ప్రాణనష్టం జరగకుండా యుద్ధ ప్రాతిపదికన ప్రజా సమస్యలను పరిష్కరించాలని కోరారు. టి.సుండుపల్లె నుండి రాయవరం వరకు పోవు రహదారి మరియు బైరవగట్ట సమీపమున పెట్రోల్ బంక్ వద్ద టి.సుండుపల్లె నుండి ఫించా పోవు దారిలో చెరుకువాండ్లపల్లె సమీపాన నాగారపమ్మ గుడివద్ద అయ్యవారిచెరువు కు సంబందించిన వంతెన దెబ్బతిని రోడ్డు పూర్తిగా కొట్టుకొనిపోయి ఉన్నది. బెస్తపల్లె నాగారపమ్మ గుడి ఆర్చినుండి ఈడిగపల్లె మీదుగా కొత్తపల్లె వరకు రోడ్డు నిర్మాణ పనులు మద్యలో నిలిపివేయడం వలన రోడ్డుపైన వున్న కంకరరాళ్ల వలన వాహనదారులు ప్రమాదాలకు గురై అనేక ఇబ్బందులు పడుతున్నారు. తిమ్మసముద్రం నుండి వయా బెస్తపల్లె పోవు రహదారిలో ఓబులేసు గుట్టవద్ద చిట్టేడు వంతెన కొట్టుకొనిపోయినది అప్పుడు తాత్కాలికంగా మట్టితోలారు. రాయచోటి నుండి తిమ్మ సముద్రము, ఫించా బస్సు సౌకర్యము ఇదివరలో వుండినది. 3 సంవత్సరముల క్రితం వంతెన కొట్టుకొనిపోయినందున సదరు బస్సును నిలిపివేసినారు. అలానే తిమ్మసముద్రం నుండి గుండ్లపల్లి, పాపన్నగారిపల్లి ఆర్.టీ.సి బస్సు సర్వీసులు లేవు. దీని వలన 36 గ్రామాల ప్రజలు బస్సులు సౌకర్యము లేక స్కూలుకు వెళ్ళే విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావున బస్సులను పునరుద్దరించాలని కోరుచున్నాము. టి.సుండుపల్లె పంచాయతి అగ్రహారం నుంచి యేటిగడ్డ రాచపల్లె, పెద్ద బలిజపల్లె మీదుగా సామిసేనిగడ్డ హరిజనవాడ వరకు రోడ్డు గుంతలు ఏర్పడి వాహనదారులు, ప్రజలు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సదరు రోడ్డు టెండర్లు జరిగి టెండర్ దక్కించుకొన్నవారు రోడ్డు వేయకుండా నిలుపుదల చెశారు. అన్నమయ్య జల్లా మొత్తం గ్రామీణ ప్రాంతాలలో రోడ్లు చాలా అధ్వాన్నంగా వున్నాయి. దీని వలన స్కూలు పిల్లలు సకాలంలో స్కూళ్ళకు వెళ్ళలేక, పేషెంట్లు, వృద్ధులు, గర్భిణీలు సకాలంలో ఆసుపత్రులకు పోలేక ఇలా అనేకమంది ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. కావున తమరు వెంటనే ప్రజల సమస్యలను పరిగణలోకి తీసుకొని యుద్ధప్రాతిపదికన సమస్యలను పరిష్కరించవలసినదిగా జిల్లా కలెక్టర్ మరియు జాయింట్ కలెక్టర్లను కోరారు.