దళితుల ఆత్మ గౌరవ నిరసన దీక్షకు మద్దతు తెలిపిన రెడ్డి అప్పలనాయుడు

ఏలూరు, గత 3 రోజులు గా శనివారపు పేట భూ పెత్తం దార్ల ఆగడాలపై బాధిత ఇందిరా కాలనీ దళితుల ఆత్మగౌరవ నిరసన దీక్షకు మంగళవారం ఏలూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ రెడ్డి అప్పల నాయుడు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా రెడ్డి అప్పల నాయుడు మాట్లాడుతూ ఏదైతే భూమి కబ్జా జరిగిందో భూ బాధితులైనటువంటి దళిత సోదర సోదరీమణులు గత కొంతకాలంగా ఆందోళన చేస్తున్నారు. స్పందన లేని ప్రభుత్వం స్పందనా లేని మంత్రుల మీద అధికార యంత్రాంగానికి చలనం వచ్చే విధంగా ఈరెండు రోజుల నుండి నిరసన దీక్ష కార్యక్రమాన్ని తలపెట్టిన శనివారపు పేట భూ బాధితులకు మద్దతుగా ఈరోజు జనసేన పార్టీ ఏలూరు నియోజకవర్గం నుండి వారికి మద్దతు తెలుపుతున్నాము. చెరువులుగా ఉన్నటువంటి భూమిని కొనుగోలు చేసి ఇళ్ళస్దలాలకు ఇవ్వడమే ఒక పెద్ద నేరం. అక్కడ ఉన్నటువంటి ఆ ల్యాండ్ ను ఖరీదు చేసి ఇళ్ళ స్థలాలకు ఇచ్చినప్పుడు అక్కడ ఎవరైతే పేదవారు ఉన్నారో ఆ పరిసర ప్రాంతాల్లోని ఎస్సీ,ఎస్టీ ,బీసీ, మైనారిటీ లు ఉన్నత వర్గాల్లోని పేద వర్గాలు వారందరికీ అక్కడ ఆసరా కల్పించే బాధ్యత పూర్తిగా మంత్రి మీదే ఉంది. ఈరోజు ఏవిధంగా ఉందంటే ఏలూరు నియోజకవర్గంలో మంత్రి యొక్క పరిపాలన పేదవారు ఎవరు కూడా ఏలూరు నగరంలో ఉండడానికి వీలు లేదన్నట్లుగా ఎద్దేవా చేశారు.. పేదవారు అందరూ కూడా ఊరికి దూరంగా ఉండాలి. మేం ఇచ్చేటువంటి పేదవారికి 45 గజాల సెంటు భూమి స్థలాన్ని ఊరికి పది నుండి ఇరవై కిలోమీటర్ల దూరంలోనే ఇస్తాం, అక్కడ మాత్రమే ఇస్తాం, లేదంటే ఊరి నుండి వెలివేస్తాం అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు.

ఏలూరు నియోజకవర్గంలో 30 వేల మంది మీద మీకు ఈ వివక్షత ఎందుకు ??
ఈ పేద ప్రజలు మీకు ఓట్లు వేయలేదా ??
మంత్రి గారు (ఆళ్ళనాని) మీ ఇంటి వెనుక భాగంలోని దళిత సోదరులను కూడా పట్టించుకోండి..
ఎందుకు ఈ వివక్ష ??

అందరికీ ఇళ్ళు ఇచ్చినప్పుడు ఆ స్థలంలోనే ఫ్లాట్లు ఇచ్చినప్పుడు ఇక్కడ ఉన్న 50,60 మంది మీకు ఎక్కువయ్యారా??

ఈరోజు ప్రభుత్వం గానీ డిప్యూటీ సీఎం గానీ పదవులు అనుభవిస్తున్న ఇతర నాయకులు గానీ వీరందరూ ఓట్లు వేస్తేనే కదా మీరందరూ ఎన్నుకోబడ్డారు.
మీ నాయకులు ఆత్మవిమర్శ చేసుకుంటే మంచిది. మొద్దు నిద్ర నుండి లేచి ఇప్పటికైనా సుపరిపాలన అందించండి అని నిలదీశారు. ఇప్పటికైనా మీరు ఈ దళిత సోదరుల పట్ల వివక్షత చూపరాదని కోరారు. వీళ్ళని ఊరి నుండి దూరంగా పంపించడం చాలా దుర్మార్గమైన, ఘోరమైన చర్యగా మేం భావిస్తున్నాం ఖండిస్తున్నాం. అక్కడే స్థానికంగా పాకలు వేసుకున్న దళిత సోదరులు బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీలు ఎవరైతే ఉన్నారో వారికి తక్షణమే ఇళ్ళను ఇవ్వండి. మీరు తీసుకు వచ్చిన లక్ష్మి పురాణంలోని పట్టా ఏదైతే ఉన్నాయో అవి అన్నీ మీరు ఈరోజున వేరే వేరే ప్రాంతాల నుండి తీసుకు వచ్చి ఇచ్చారు కనుక దాని మీద మేం ఏం మాట్లాడుకోదలచుకోవడం లేదు. ఎందుకంటే ఈ ఊరిలో 600 మందికి ఫ్లాట్లు ఇచ్చినప్పుడు ఇచ్చిన వారిని దూరంగా పంపడం చాలా దుర్మార్గమైన చర్య అని మేం ఖండిస్తున్నాం. అలాగే జిల్లా యంత్రాంగం మరియు రెవెన్యూ వారికి తెలియజేస్తున్నాము. భూమి కబ్జా చేయకూడదు అని సుప్రీంకోర్టు లో ఉంది కదా. ఇళ్ళ స్థలాలు చెరువులో ఇవ్వకూడదు అని అనేక రకాలైన చట్టాలు జీవోలు ఉండగా మీరు ఏ రకంగా కబ్జాలు చేయిస్తున్నారు అని నిలదీశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్.సి.నాయకులు నూకపెయ్యా కార్తిక్, శ్యాంప్రసాద్, మత్తే బాబీ, అగస్త్యన్, గొల్లా నరేష్, కోలామణి, ఏలూరు జనసేన పార్టీ నగర అధ్యక్షుడు నగిరెడ్డి కాశీ నరేష్, మండల అధ్యక్షుడు వీరంకి పండు, మండల ఉపాధ్యక్షుడు సుందరనీడి వెంకట దుర్గా ప్రసాద్, జాయింట్ సెక్రటరీ ఎట్రించి ధర్మేంద్ర, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ జనసేన రవి, నాయకులు సుందరనీడి శివ శంకర్, తోట దుర్గా ప్రసాద్, తోట రాజేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.