రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్న సరికొప్పుల
హుజూర్నగర్ నియోజకవర్గం: ప్రముఖ మీడియా ఛానల్ ఐ న్యూస్ వారి ఆధ్వర్యంలో ఆదివారం తెలంగాణ ప్రజల ఎజెండా రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి హుజూర్నగర్ నియోజకవర్గ జనసేన పార్టీ ఇంచార్జ్ సరికొప్పుల నాగేశ్వరరావు జనసేన పార్టీ తరఫున పాల్గొని నియోజకవర్గంలో ఉన్నటువంటి పలు సమస్యలపై వాటి పరిష్కారాలపై నియోజకవర్గ ప్రజల దృష్టికి ప్రజా నాయకుల దృష్టికి తీసుకురావడం జరిగింది. రాబోయే రోజుల్లో హుజూర్నగర్ నియోజకవర్గంలో జనసేన పార్టీ గెలుపు తధ్యమని మీడియా సమావేశంలో తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసైనికులు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది.