KPHB కాలనీ జనసేనపార్టీ కార్యాలయంలో శంకర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు

కూకట్పల్లి నియోజకవర్గం, KPHB కాలనీలో జనసేన పార్టీ కార్యాలయంలో జనసేన పార్టీ రాష్ట్ర ఇంచార్జీ శ్రీ నేమూరి శంకర్ గౌడ్ పుట్టినరోజు వేడుకలు జనసేన పార్టీ కార్యకర్తల సమక్షంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భముగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు తుమ్మల మోహన్ కుమార్ మాట్లాడుతూ మా ఇంచార్జీ పుట్టినరోజు జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని వారి పుట్టినరోజు సందర్భముగా జిహెచ్ఎంసి ఎంటమాలజీ సిబ్బందికి బిర్యానీ ప్యాకెట్ లను పంచిపెట్టడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో 114 డివిజన్ ప్రెసిడెంట్ కొల్ల శంకర్, 115 డివిజన్ ప్రెసిడెంట్ దుర్గా శ్రీనివాస్, సాయి, మాలిక్ మరియు జనసేన నాయకులు పాల్గొన్నారు.