జగన్ పాలనలో ప్రజల కష్టాల పాలు: ఆదాడ మోహనరావు

🔸 జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా కరపత్రాల పంపిణీ

విజయనగరం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వారోత్సవాల్లో భాగంగా గురువారం ఉదయం కోట జంక్షన్ మొదలుకొని పట్టణంలో జనసమూహ ప్రధాన కేంద్రాల్లో జగన్ పాలనలో ప్రజలు పడుతున్న కష్టాలు మరియు జనసేన విధివిధానాలు, కౌలు రైతులకు చేస్తున్న సహాయం వంటివి కూడియున్న కరపత్రాలను జనసేన పార్టీ సీనియర్ నాయకులు మరియు జిల్లా చిరంజీవి యువత అధ్యక్షులు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో పంచిపెట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా జనసేన పార్టీ సీనియర్ నాయకులు ఆదాడ మోహనరావు హాజరయ్యారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని ప్రజల ఆశీస్సులతో అందల మెక్కిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని, ప్రజలను అప్పులు పాలు చేసి అంధకారంలో నెట్టివేశాడని, రెండోసారి అవకాశం ఇస్తే మనల్ని, మన ఇంటిని కూడా అమ్మేస్తాడని దుయ్యబట్టారు. రాష్టంలో సామాన్య మైన పేద ప్రజలు మొదలుకొని రైతులు, ఉద్యోగస్థులు, విద్యార్థుల దగ్గర నుండి అన్ని వర్గాల ప్రజలకు ఉసురుపెట్టాడని, ప్రజలంతా సమయం కోసం వేచివున్నారని, ఖచ్చితంగా జగన్ ను బంగాళాఖాతంలో కలిపే రోజు ఎంతోదూరంలో లేదని అన్నారు. మరో నాయకులు వంక నరసింగరావు, దంతులూరి రామచంద్ర రాజు మాట్లాడుతూ కొట్లాది రూపాయల ఆదాయాన్ని వదులుకొని నిస్వార్థమే ఊపిరిగా ప్రజలకు సేవచేయడానికి వచ్చిన నాయకుడు పవన్ కళ్యాణ్ అని, ప్రభుత్వం కౌలురైతులకు ఇస్తానని చెప్పిన డబ్బులు ఇవ్వకపోయినా, పవన్ కళ్యాణ్ తన కష్టార్జితాన్ని ఒక్కో రైతుకు ఒక లక్ష చప్పున సహాయం అందిస్తున్నారని, అధికారం లేకుండానే ఇంత సహాయం చేస్తున్న పవన్ కళ్యాణ్ ను చూసి ఒక్కసారి ప్రజలు అవకాశం ఇవ్వాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ ఎస్. మురళీమోహన్, జనసేన యువనాయకులు కొయ్యాన లక్ష్మణ్ యాదవ్, గురుబిల్లి రాజేష్, శ్రీను రాజు పాల్గొన్నారు.