పవన్ కళ్యాణ్ ఆటోబయోగ్రఫీ వ్రాస్తున్నషేక్ భాషా
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, పాల్వంచ మండలానికి చెందిన షేక్ భాషా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వీరాభిమాని. ముందునుండి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పార్టీపరంగా చేసే కార్యక్రమాలను ప్రోత్సహించే ఒక ముఖ్యమైన కార్యకర్తగా మరియు అనుచరుడిగా ఉన్న షేక్ భాషా.. పవన్ కళ్యాణ్ పై ఉన్న అభిమానం, స్ఫూర్తి తో పవన్ కళ్యాణ్ గారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో రచించడం జరిగింది.
అందరిలా కాకుండా జనసేనానికి ఉండే సేవా దృక్పథం, అన్యాయంపై ప్రశ్నించేతత్వం, ఎదుటివారు కష్టoలో ఉన్నారంటే చలించిపోయే మనసు, సాయం కావాలి అంటూ.. ఎవరు వచ్చినా లేదనకుండా సాయం చేసే తెగువ.. వీటన్నిటికీ మించి.. కోట్లు సంపాదించగల తన విలువైన సమయాన్ని ప్రజల కోసం కేటాయించే అధినాయకుడి స్ఫూర్తిని అందరిలోనూ నింపాలని, ఆయన ఆదర్శాలను ప్రజలకు మరింత చేరువ చేయాలనే ప్రయత్నంలో భాగంగా.. షేక్ భాషా పవన్ కళ్యాణ్ గారి జీవిత చరిత్రను పుస్తక రూపంలో వ్రాయడం జరిగింది.
ఈ పుస్తక ఆవిష్కరణ త్వరలోనే 99 టీవీ మరియు కొన్ని చానళ్లు సాక్షిగా జరుగనుంది. ఈ సందర్భంగా.. ఈ పుస్తక ఆవిష్కరణ కు సహకరించిన వారందరికీ షేక్ భాషా ధన్యవాదాలు తెలియ జేయడం జరిగింది.