తణుకు నియోజకవర్గంలో విజయవంతంగా శ్రమదాన కార్యక్రమం చేపట్టిన జనసేన నాయకులు అనుకుల రమేష్

తణుకు నియోజకవర్గం 7వ వార్డు ఇందిరమ్మ కాలనీలో నేడు జరిగిన జనసేన పార్టీ శ్రమదాన కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు అనుకుల రమేష్ పాల్గొని అక్కడ ఉన్న ప్రధాన కూడలి వద్ద గత నెల రోజుల క్రితం తవ్వి వదిలేసిన గోతులు పూడ్చి కంకర వేసి ప్రజలకు ఉపయోగకరంగా తీర్చి అక్కడి ప్రజల మన్ననలు పొందటం జరిగింది. ఈ కార్యక్రమంలో అడబాల మణికంఠ, సాయి, శివ, మోహన్, పిల్లాడి రవి, జనసేన నాయకులు, వీర మహిళలు మరియు జనసైనికులు పాల్గొన్నారు.