ఏడిద వీరమ్మ కుటుంబాన్ని పరామర్శించిన శ్రీధర్ పిల్లా

పిఠాపురం నియోజకవర్గం, పిఠాపురం మండలం, భోగాపురం గ్రామం నందు ఏడిద వీరమ్మ అకాల మరణానికి చింతిస్తూ పిఠాపురం జనసేన నాయకులు శ్రీ విష్ణు హాస్పిటల్ అధినేత డాక్టర్ శ్రీధర్ పిల్లా ఏడిద వీరమ్మ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. వారి కుటుంబ అవసరాల నిమిత్తం 50 కేజీల బియ్యం ఆర్థిక సహాయంగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కట్టా నానాజీ, అడపా శివరామకృష్ణ, పోతుల బాబ్జి, పాలెం బాబ్జి, అనంత వీరబాబు, కే శ్రీనివాస్, పి త్రిమూర్తులు, పి చిన్న, నక్క ఏసు, గంధం నాని, మరియు జనసైనికులు, గ్రామ పెద్దలు పాల్గొనడం జరిగింది.