SSC జూనియర్ ఇంజినీర్ నోటిఫికేషన్ విడుదల

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్నజేఈ పోస్టుల భర్తీకి SSC నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత, ఆసక్తి, అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. ఆన్‌లైన్ దరఖాస్తులు అక్టోబర్ 30 వరకు అందుబాటులో ఉంటాయని తెలిపింది. కాగా, ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నదనే విషయాన్ని ప్రకటించలేదు. పరీక్ష సమయానికి పోస్టుల సంఖ్యను కమిషన్ వెబ్‌సైట్‌లో ప్రకటిస్తామని వెల్లడించింది.

ఈ ఖాళీలు బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్ (బీఆర్ఓ), సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (సీపీడబ్ల్యూడీ), సెంట్రల్ వాటర్ కమిషన్‌, సెంట్రల్ వాటర్ అండ్ పవర్ రిసెర్చ్ స్టేషన్‌, డైరెక్టరేట్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్ (నావల్‌), ఫరక్కా బ్యారేజ్ ప్రాజెక్ట్‌, మిలటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ (ఎంఈఎస్‌), నేషనల్ టెక్నికల్ రిసెర్చ్ ఆర్గనైజేషన్ (ఎన్‌టీఆర్ఓ) వంటి విభాగాల్లో ఉన్నాయి.

అర్హతలు: మెకానికల్ ఇంజినీరింగ్‌, సివిల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ లేదా సివిల్ ఇంజినీరింగ్, ఎలక్ట్రానిక్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. సంబంధిత రంగంలో కనీసం రెండేండ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. 2021, జనవరి 1 నాటికి 32 ఏండ్ల లోపువారై ఉండాలి.

నోట్‌: బార్డర్ రోడ్ ఆర్గనైజేషన్‌లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.

ఎంపిక విధానం: రాతపరీక్ష ద్వారా (సీబీఈ)

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో

అప్లికేషన్ ఫీజు: రూ.100, మహిళలు, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.

దరఖాస్తులకు చివరితేదీ: అక్టోబర్ 30

ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించడానికి చివరితేదీ: నవంబర్ 1

రాతపరీక్ష: 2021, మార్చి 22 నుంచి 25 వరకు

వెబ్‌సైట్‌: https://ssc.nic.in