జనసేనకు యునైటెడ్ కింగ్డమ్ ఎన్నారైల మద్దతు
- ప్రభుత్వాన్ని మార్చుదాం
- రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం
- పంచకర్లకు మద్దతుగా యూకే జనసేన టీం ప్రచారం
పెందుర్తి: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వాన్ని మార్చుదాం.. రాష్ట్రాన్ని బాగు చేసుకుందాం అని యూకే జనసేన టీం సభ్యులు ప్రజలకు పిలుపునిచ్చారు. పెందుర్తిలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ప్రవాస భారతీయులు పంచకర్ల రంగనాథ్, సిద్ధం శంకర్, చంద్ర సిద్ధం, అచ్యుత రాజు కుర్మాపు తదితరులు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నష్టపరిచిందని, దీన్ని సరిదిద్దుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమిని గెలిపించేందుకు ప్రవాస భారతీయులందరూ కృషి చేస్తున్నట్లు వెల్లడించారు. ముఖ్యంగా యూకే, కెనడాల నుండి 200 మంది జనసేన టీం రాష్ట్రానికి వచ్చామని, జనసేన పోటీ చేస్తున్న 21 నియోజకవర్గాల్లో విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో పెందుర్తి నియోజకవర్గం నుండి పోటీ చేస్తున్న పంచకర్ల రమేష్ బాబు గెలుపు కోసం పనిచేస్తామని వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ విజ్ఞతతో ఆలోచించి ఎన్డీఏ కూటమిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. యువతకు ఉపాధి, రైతులకు భరోసా పారిశ్రామికరణ పెట్టుబడులు సమీకరణ తో పాటు రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి చెందాలంటే ఎన్డీఏ అధికారంలోకి రావాలని వారు ఆకాంక్షించారు. ఈ ఈవెంట్ కి యూ కే జనసేన టీం తరుపున నాగరాజు వడ్రాణం, అమల చలమలశెట్టి, శివ కుమార్ మేక, పద్మజ రామిశెట్టి, నాగేంద్ర సోలంకల, శివ రామిశెట్టి, అశోక్ మాజేటి సపోర్ట్ గ ఉండటం జరిగింది. పెందుర్తి నియోగక వర్గం వాస్తవ్యులు అయిన అచ్యుత రాజు కుర్మాపు సహాయ సహకారానికి
యూ కే – జనసేన టీం స్పెషల్ థాంక్స్ తెలపటం జరిగింది.