ఫైనల్‌కి దూసుకెళ్లిన కివీస్.. ఇంగ్లాండ్‌పై ఘన విజయం
టీ20 వరల్డ్ కప్‌లో భాగంగా ఫస్ట్ సెమీ ఫైనల్ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌పై న్యూజిలాండ్ ఘన విజయం సాధించింది.
ఉత్కంఠంగా సాగిన మ్యాచ్‌లో ఐదు వికెట్ల తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. తొలుత టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లాండ్ నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. 167 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన న్యూజిలాండ్ 19 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లాండ్ బ్యాటర్లలో డేవిడ్ మలన్(41), మొయిన్ అలీ(51) అద్భుతమైన ఇన్నింగ్స్‌తో జట్టుకు గౌరవప్రదమైన స్కోరును అందించినా ఫలితం లేకుండా పోయింది.
న్యూజిలాండ్ బ్యాటర్లలో ఓపెనర్లు విఫలమైనా మిచెల్ (72), కాన్వే(46) రాణించారు. చివర్లో జెమీ నీషమ్ మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో లక్ష్యాన్ని ఛేదించడం సులభతరమైంది. ఇంగ్లాండ్‌పై విజయంతో న్యూజిలాండ్ ఫైనల్‌లోకి దూసుకెళ్లింది. కాగా, 2019 వరల్డ్ కప్ ఫైనల్‌లో ఇంగ్లాండ్ చేతిలో ఓటమి పాలైన కివీస్ ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను చిత్తుచేసి ప్రతీకారం తీర్చుకుంది.