టిడ్కో గృహ సముదాయంలో టీడీపీ ఎన్నికల ప్రచారం
దేవర్లంక, కోనసీమ జిల్లా, టిడ్కో గృహ సముదాయం లోటీడీపీ రాష్ట్ర కార్యనిర్వహక కార్య దర్శిమెట్ల రమణబాబు ఆధ్వర్యంలో తెలుగుదేశం ప్రచారం నిర్వహించారు. టిడిపి ఎన్నికల వాగ్దానాలకర పత్రాలుపంచి పెట్టారు. ఇంటింటీకి వెళ్లిసైకిల్ గుర్తుకు ఓటు వేయమని ఓటర్లను అభ్యర్ధించారు. అనంతరం జరిగిన సమావేశంలో మెట్ల రమణబాబు మాట్లాడుతూ అమలాపురం పార్లమెంట్అభ్యర్థి గంటి హరీష్ మాధుర్, అసెంబ్లీ అభ్యర్థి అభ్యర్థి అయితా బత్తుల ఆనందరావు (టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడి కూటమి)సైకిల్ గుర్తుకు ఓటు వేసి గెలిపించాలి అని కోరారు. టిడ్కో గృహలు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో నిర్మించినవి అని, మరల టిడిపి ప్రభుత్వం వస్తే అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తి చేస్తాము అని హామీ ఇచ్చారు. మాజీ మున్సిపల్ చైర్మన్ చిక్కాలగణేష్ మాట్లాడుతూ తెలుగుదేశం ప్రభుత్వములో అమలాపురం పట్టణానికి ఏ బి సి కేటగిరీల్లో 1000 ఇళ్ళు మంజూరు కాగా ముఖ్యమంత్రి చంద్రబాబు మరో 600ఇళ్ళు పెంచారు అన్నారు. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి మెట్ల రమణబాబు, మాజీ మున్సిపల్ చైర్మన్లు చిక్కాల వినాయక రావు,పెచెట్టి విజయలక్ష్మి, టిడిపి పట్టణ అధ్యక్షుడు తిక్కిరెడ్డి నేతాజీ, తెలుగుదేశం పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి కర్రి రామ స్వామి (దత్తుడు), మున్సిపల్ కౌన్సిలర్ బొర్రా వెంకటేశ్వరరావు, చిక్కాల రాంబాబు, మాజీ కౌన్సిలర్లు అశెట్టి అదిబాబు, దున్నాల దుర్గ, జంగా అబ్బాయి వెంకన్న, భాస్కర్ల రామకృష్ణ, దాసం గోపి, తెలుగు మహిళ మాకిరెడ్డి పూర్ణిమ, శ్రీను గంధం, జనసేన నాయకులు పడాల నానాజీ, తిక్కా ప్రసాద్, గండి స్వామి, పిండి రాజ, చిక్కాల సతీష్, డి ఎస్ ఎన్ కుమార్, బీజేపీ నాయకులు బండి శ్రీను, బచ్చు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.