IND vs ENG: రెండో రోజు ఆట..విరాట్ డకౌట్.. టీమిండియా 49/3
అహ్మదాబాద్: నరేంద్ర మోడీ స్టేడియంలో భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న నాలుగో టెస్టు మొదటి ఇన్నింగ్స్ రెండో రోజు టీమిండియా 31 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 49 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. బ్యాటింగ్ ప్రారంభించిన ఇండియాకు ఆరంభంలోనే గట్టి దెబ్బ తగిలింది. అండర్సన్ వేసిన మొదటి బంతికే ఓపెనర్ శుభ్మన్ గిల్ వికెట్ల ముందు దొరికిపోయాడు. దీంతో ఖాతా తెరవకుండానే ఇండియా ఒక వికెట్ కోల్పోయింది. విరాట్ కోహ్లీ పరుగులేమీ చేయకుండా స్టోక్స్ బౌలింగ్లో ఫోక్స్కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. రెండో రోజు వరుసగా పుజారా, విరాట్ కోహ్లీ వికెట్లను కోల్పోయింది భారత్. ఛటేశ్వరా పుజారా 17 పరుగులు చేసి లీచ్ బౌలింగ్లో ఎల్బిడబ్లు రూపంలో ఔటయ్యాడు. ప్రస్తుతం క్రీజులో రోహిత్ శర్మ(26), అజింక్య రహానే(02) బ్యాటింగ్ చేస్తున్నారు. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులు చేసింది. ఈ సిరీస్లో భారత్ 2-1 తేడాతో ముందంజలో ఉన్న విషయం తెలిసిందే.