తెలంగాణ ఉద్యమకారుల సన్మాన సభ పోస్టర్ విడుదల

నిర్మల్ జిల్లా భైంసా పట్టణం లోని అంబేద్కర్ విగ్రహం దగ్గర రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో సన్మాన సభ పోస్టర్ విడుదల చేయడం జరిగింది. జనసేన, కాంగ్రెస్, బిజెపి, సీపీఐఎంఎల్, ఉద్యోగ, బిసి, ఎస్సీ, కార్మిక, మహిళ సంఘం నాయకులు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కారణమైన ఎందరో అమరవీరుల త్యాగాలను మరచి పోయారు. కేవలం ఒకే కుటుంబం రాష్ట్రాన్ని నియంతల పాలించడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తెలంగాణ వ్యతిరేకులకు పదవులు కట్టబెట్టి, ఉద్యమ కారులను అవమాన పరచినందుకు భవిష్యత్తులో తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. వెంటనే ప్రభుత్వం ఉద్యమ కారులను ఆదుకోవాలని డిమాండ్ చేసారు. లేని యెడల సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయడానికి సిద్ధంగా వున్నామని ఈ సందర్భంగా తెలియచేశారు.
డిమాండ్స్.. తెలంగాణ ఉద్యమ కారుల సంక్షేమ బోర్డును వెంటనే ఏర్పాటు చేయాలి.
అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమ కారుల డిక్లరేషన్ ను ప్రకటించాలి.
ఉద్యమ కారులకు పెన్షన్, వడ్డీ లేని రుణాలు, ఉచిత బస్ పాస్ ఆరోగ్య కార్డులు, సంక్షేమ పథకాలలో 20%వాట కేటాయించాలి.

ఉద్యమ కారులను తెలంగాణ స్వాతంత్ర సమర యోధులుగా గుర్తించి గౌరవించి.. జార్ఖండ్ రాష్ట్రంలో అమలు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్రంలో అమలు చేయాలి.

అన్ని రాజకీయ పార్టీలు ఉద్యమ కారులకు ప్రాధాన్యత ఇవ్వాలి. తదితర డిమాండ్ల సాధన కోసం ఆగస్ట్ 14 హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే సభను ప్రజలు, ఉద్యమ కారులు పాల్గొని విజయవంతం చేయాలని తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం పిలుపునిస్తుంది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ గౌడ్, చాకేటి లస్మన్న, సుంకెట మహేష్ బాబు, రాజు, హరిత, డో0గ్రే భీమ్ రావ్, గిరిధర్ జంగ్మే, అశోక్, నాగ్ నాథ్, రామ కృష్ణ, శ్రావణ్, శ్రీనివాస్ రాజ్, సంటెన్న తదితరులు పాల్గొన్నారు.