ఇంటర్ బోర్డు వైఖరి నిరసిస్తూ తెలంగాణ జనసేన విద్యార్ధి విభాగం బంద్

ఇంటర్ బోర్డ్ నిర్లక్షమో, ఇంటర్ అధికారుల తప్పుడు వైఖరి వల్లనో తెలంగాణలో ఇంటర్ ఫలితాలు లో అనూహ్యామైన ఫలితాలు వల్లనో ఇంటర్ విద్యార్దుల ప్రాణాలు పోయాయి.

తెలంగాణలో విడుదలైన ఇంటర్ ఫలితాలు కొందరు విద్యార్థుల పాలిట మరణశాసనంగా మారి ఆత్మహత్యలకు దారితీసాయి. తల్లిదండ్రులకు కడుపు కోత మిగిలాయి. కుటుంబాల్లో తీరని విషాదం నింపుతున్నాయి. ప్రతి సంవత్సరంలానే ఈసారి కూడా ఇంటర్ ఫలితాలు వెలువడగానే ఇద్దరు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. ఇంటర్లో ఫెయిలయ్యామన్న మనస్థాపంతో నల్గొండకు చెందిన జాహ్నవి, నిజామాబాద్కు చెందిన ధనుష్ తమ ప్రాణాలను తీసుకున్నారు. నల్గొండకు చెందిన జాహ్నవి ఇంటర్లో ఒక సబ్జెక్ట్లో ఫెయిలైంది. దీంతో తనకిక జీవితమే లేదనుకుంది. అర్థాంతరంగా జీవితాన్ని ముగించింది. రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. ఫలితాలు విడుదలయ్యాక తాను ఒక సబ్జెక్ట్లో ఫెయిల్ అయినట్టు తెలుసుకుంది జాహ్నవి.. ఇదే విషయాన్ని ఇంట్లోచెప్పింది. దీంతో ఇంట్లో తల్లిదండ్రులు ఏం జరిగింది? ఎందుకు ఫెయిల్ అయ్యావు? అంటూ జాహ్నవిని ప్రశ్నించారు. దీంతో ఏం సమాధానం చెప్పలేకపోయింది. తనలో తానే కుమిలిపోయింది. బాగానే చదివే నేను ఎందుకు ఫెయిల్ అయ్యానన్న ప్రశ్న వెంటాడిందో ఏమో అందరూ పడుకున్నాక రైల్వే ట్రాక్పైకి వెళ్లి ఆత్మహత్య చేసుకుంది.

సరిగా క్లాస్లు జరిగింది లేదు.. ప్రాక్టికల్స్‌ కూడా ప్రాపర్గా జరగలేదు. దీంతో టెన్త్ మాదిరిగానే ఇంటర్ విద్యార్థులనూ ప్రమోట్ చేస్తారని విద్యార్థులు భావించారు. పరీక్షలకు ముందు అధికారులు, పాలకులు అదే విధమైన స్టేట్మెంట్లు ఇచ్చారు. తీరా ఆఖరి నిమిషానికి వచ్చేసరికి పరీక్షలు రాయాల్సిందే అన్నారు. దీంతో సరిగా ప్రిపేర్ కాలేకపోయిన విద్యార్థులు.. ఆటంకాల మధ్యే పరీక్షలు రాశారు.

ప్రోత్సహించే లాగానే ఫలితాలు వస్తాయని భావించారు. కానీ విద్యార్థుల గుండెల్ని పిండేసేలా ఇంటర్ బోర్డ్ ఫలితాలు ఇచ్చింది. ఏకంగా 51శాతం మంది విద్యార్థులను ఫెయిల్ చేసింది. ఇప్పుడు ఇదే విద్యార్థులకు గుండెకోతను మిగులుస్తోంది. ఫలితాలను తట్టుకోలేకపోతున్న విద్యార్థులు.. బలవంతంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. అర్థాంతరంగా జీవితాలను ముగించేస్తున్నారు. తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చింది. ఇవి మచ్చుకు వెలుగులోకి వచ్చిన ఒకటి రెండు విషయాలు మాత్రమే. ఇలా తెలంగాణ వ్యాప్తంగా పదుల సంఖ్యలో విద్యార్థులు.. ఆత్మహత్యాయత్నాలకు పాల్పడ్డారు. గణేశ్ రూపానీ లాంటి విద్యార్థులు.. మంత్రి కేటీఆర్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికే ఆత్మహత్య చేసుకోబోతున్నట్లుట్వీట్ చేశారు. కేవలం తెలుగు, ఇంగ్లీష్ సబ్జెక్ట్స్లో మాత్రమే తనను పాస్ చేసి.. నాలుగు సబ్జెక్ట్స్లో ఫెయిల్ చేశారని మార్క్స్
లిస్ట్ను ట్యాగ్ చేశాడు. ఇంటర్ ఫలితాలపై మనస్థాపంతో విద్యార్థులు ప్రాణాలు తీసుకుంటుండంపై విద్యార్థి సంఘాలు రగిలిపోతున్నాయి. కరోనా సమయంలో పరీక్షలు వద్దని చెప్పినా వినకుండా హడావుడిగా పరీక్షలు పెట్టి.. విద్యార్థుల భవిష్యత్ను నాశనం చేశారని విద్యార్దుల తల్లితండ్రులు మండిపడుతున్నారు. కనీస మార్కులు వేసి విద్యార్థులందరినీ పాస్ చేయాలని.. రీవాల్యుషన్ అవకాశమూ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. లక్ష మంది ఇంటర్ విద్యార్థులను మానసిక క్షోభకీ గురిచేసి, విద్యార్థుల విద్యార్థుల చావుకి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఇంటర్ బోర్డు వైఖరిని నిరసిస్తూ జనసేన తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం అద్యక్షులు శ్రీ డా:సంపత్ నాయక్ 21-12-2021 (మంగళవారం) రోజున బంద్ పిలుపునివ్వటం జరిగింది. విద్యార్దినాయకులు తెలంగాణా లో ఉన్న అన్ని ఇంటర్ కాలేజీలవద్దకు వెళ్లి ఇంటర్ విద్యార్ధులకు సంఘీబావం తెలపడమే కాక, ఈ ప్రభుత్వం చేస్తున్న అక్రుత్యలమీద నిరసన గళం వినిపిస్తారని తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం అద్యక్షులు శ్రీ డా:సంపత్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు.

జనసేన తెలంగాణ జనసేన విద్యార్థి విభాగం ప్రధాన డిమాండ్స్

  • ఇంటర్ విద్యార్థులందరికీ ఉచిత రివాల్యూషన్ సౌకర్యం కల్పించాలి.
  • ఇంటర్ ఫలితాలలో జరిగిన సాంకేతిక లోపాలను సరిచేసి వెంటనే నూతన ఫలితాలను ప్రకటించాలి.