గ్రామ స్ధాయిలో జనసేన బలోపేతమే లక్ష్యంగా .. పవనన్న ప్రజాబాట

*పవనన్న ప్రజాబాట 89వరోజు

శ్రీకాకుళం జిల్లా, ఎచ్చెర్ల నియోజకవర్గం, రణస్థలం మండలం, కోష్ట పంచాయతీ దువ్వాన పేట గ్రామం ఎచ్చెర్ల నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు మరియు సోసైటి బ్యాంకు మాజీ చైర్మన్ కరిమజ్జి మల్లీశ్వారావు ఆధ్వర్యంలో ఇంటింటికి కార్యక్రమం వెల్లడం జరిగింది.

ఈ సందర్భంగా కరిమజ్జి మల్లీశ్వారావు గ్రామస్థాయిలో పార్టీ బలోపేతానికి కృషి చేయాలని కోరారు. అలాగే గ్రామాల్లో వ్యవహరించాల్సిన తీరును ఆయన వివరించారు. మరియు గ్రామాల్లో పార్టీ యొక్క మేనిఫెస్టో, మరియు పార్టీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సూచించారు. అందుకు త్వరలోనే మండలాల వారిగా గ్రామ పర్యటనకు శ్రీకారం చుడతామని ఆయన అన్నారు. అందేవిధంగా గ్రామ స్ధాయిలో ఇంటింటికి వెళ్లి ప్రతి ఒక్కరిని కలవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో రణస్థలం మండలం కృష్ణాపురం పంచాయతీ జనసేన పార్టీ నాయకులు యంపిటిసి అభ్యర్థి పోట్నూరు లక్ష్మునాయుడు పాల్గొన్నారు.

పవనన్న ప్రజాబాట ప్రారంభించి 89వ రోజు సుదీర్ఘంగా ప్రజల దగ్గరకి వెళ్లి పలు కుటుంబాలను కలిసి మేనిఫెస్టో గురించి వివరంగా చెప్పడం జరిగింది. పవనన్న ప్రజాబాట తాము ప్రారంభించిన ప్రజలనుండి అపూమైన స్పందన లభిస్తోందన్నారు. గత ఎన్నికల సందర్భంగా ఒక్క ఛాన్స్ జగన్ కి ఇచ్చాం అని ఓటేసిన వారెవరూ ఈసారి వైసీపీకి ఓటు వేసేందుకు సిద్ధంగా లేరన్నారు ఈ కార్యక్రమంలో సూర్యప్రకాష్, సోమినాయుడు, అప్పారావు, గౌరి నాయుడు, గురుమూర్తి, సత్యం, గంగాధర్, గ్రామం పెద్దలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.