రాష్ట్రంలో రౌడీలందరికీ బాస్… ముఖ్యమంత్రే

•జగన్ కుటుంబ దుర్మార్గాలను సినిమాగా తీస్తే కె.జి.ఎఫ్.ను మించిపోతుంది
•‘కడప జిల్లాలో పాలెగాళ్ళ రాజ్యం’ పుస్తకం చదివితే జగన్ కుటుంబ అరాచకాలు అర్థమవుతాయి
•ప్రజల్లో తిరిగే దమ్ములేక ముసుగులేసుకొని… పరదాల మాటున తిరుగుతున్నారు
•మంత్రి దాడిశెట్టి రాజా, ఎమ్మెల్సీ అనంతబాబు లాంటి వైసీపీ నేతలపై ఉన్న హత్య కేసులు గుర్తులేవా?
•జనసేన పార్టీ పిఏసి సభ్యులు పంతం నానాజీ, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్, ప్రకాశం జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్

రాష్ట్రంలో రౌడీయిజాన్ని పెంచి పోషిస్తోంది ముఖ్యమంత్రి జగన్ రెడ్డేనని, ఆయనే రౌడీలందరికీ బాస్ అని జనసేన పార్టీ నాయకులు స్పష్టం చేశారు. పచ్చకామెర్లు వచ్చినవాడికి లోకమంతా పచ్చగా కనిపించినట్లు… ఆర్థిక నేరాల్లో ఆరితేరిన శ్రీ జగన్ రెడ్డికి ప్రజలంతా నేరస్తులు, రౌడీల్లా కనిపిస్తున్నారని ఎద్దేవా చేశారు. మంగంపేట ముగ్గురాళ్ళ గనుల దగ్గర జగన్ రెడ్డి తాత రాజారెడ్డి నుంచి ఇప్పటి జగన్ వరకూ చేసిన, చేస్తున్న దుర్మార్గాలను సినిమాగా తీస్తే కె.జి.ఎఫ్. సినిమాను మించిపోతుందని చెప్పారు. జగన్ కుటుంబం చేసిన దోపిడీలు, హత్యలు, దుర్మార్గాలు, రౌడీయిజం, అవినీతిపై సినిమాగా తీయాలనుకుంటే కనీసం పది పార్టులు తీయాలని, పాన్ ఇండియా ఏం ఖర్మ పాన్ వరల్డ్ సినిమా అవుతుందని ఎద్దేవా చేశారు. సోమవారం హైదరాబాద్ కేంద్ర కార్యాలయంలో జనసేన పార్టీ పీఏసీ సభ్యులు శ్రీ పంతం నానాజీ, పొలిట్ బ్యూరో సభ్యులు అర్హంఖాన్, పార్టీ ప్రకాశం జిల్లా ఇంఛార్జి శ్రీ షేక్ రియాజ్ వీడియా సందేశం ఇచ్చారు. ఈ సందర్భంగా శ్రీ షేక్ రియాజ్ మాట్లాడుతూ 32 కేసుల్లో ఏ1 ముద్దాయిగా ఉండి 16 నెలలపాటు చంచల్ గూడ జైలులో ఉన్న జగన్ రెడ్డి… జనసేనను రౌడీసేన అనడం హాస్యస్పదంగా ఉంది. అధికారంలోకి వచ్చిన ఈ మూడున్నరేళ్లలో మత్స్యకారులకు చేసిన అభివృద్ధి చెప్పడానికి ఏమీ లేకపోవడంతో నరసాపురం వెళ్లి మా పార్టీ అధ్యక్షులు, పార్టీ మీద ఇష్టమొచ్చినట్లు నోరు పారేసుకుంటున్నారు. జగన్ రెడ్డి చరిత్ర చూస్తే టీనేజీ నుంచి నేరాలు, ఘోరాలే కనిపిస్తాయి. జగన్ రెడ్డి గురించి, ఆయన తాత, తండ్రి గురించి కడప జిల్లాకి చెందిన మానవ హక్కుల ఉద్యమకారులు తయారు చేసిన ‘కడప జిల్లాలో పాలెగాళ్ళ రాజ్యం’ పుస్తకం చదివితే వీళ్లు ఎంత దుర్మార్గులో ప్రజలకు అర్ధమవుతుంది. వైసీపీలో అందరూ గొప్పవాళ్లు, మహానుభావులు అన్నట్లు జగన్ రెడ్డి మాట్లాడుతున్నారు.
•హత్య చేసి శవాన్ని డోర్ డెలివరీ చేసింది వైసీపీ ఎమ్మెల్సీయే: షేక్ రియాజ్
మనిషిని చంపేసి డోర్ డెలివరీ చేసిన ఎమ్మెల్సీ అనంతబాబు, పార్టీలో అడ్డుగా ఉన్నాడని చౌలూరి రామకృష్ణ రెడ్డిని హత్య చేయించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్సీ ఇక్బాల్, విలేఖరిని చంపించిన కేసులో ఉన్న మంత్రి దాడిశెట్టి రాజా, గుడ్డలు విప్పుకొని అసభ్యంగా ప్రవర్తించే గోరంట్ల మాధవ్ ఉన్నది వైసీపీలోనే. గంట వచ్చిపో అనే అవంతి, అన్నీ చేసిద్దా లేదా అని బేరాలాడే అంబటి లాంటి జాతి రత్నాలను పార్టీలో పెట్టుకొని జగన్ … జనసేనను రౌడీసేన అనడం సిగ్గుచేటు. భవన నిర్మాణ కార్మికుల ఇబ్బందులు బయటపెట్టినందుకా జనసేన ఆయనకు రౌడీసేనలా కనిపించింది? జగనన్న ఇళ్లు పేదలందరికీ కన్నీళ్లు పేరుతో వైసీపీ నాయకుల స్కాం ను బయటపెట్టినందుకా? దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలి.
* దమ్ము, ధైర్యం ఉంటే పరదాల చాటున కాదు ప్రజల్లో తిరుగు : పంతం నానాజీ
రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు పంతం నానాజీ మాట్లాడుతూ “ముఖ్యమంత్రికి ప్రజల్లో ధైర్యంగా తిరగడానికే దమ్ము లేక… ముసుగులు, డేరాలు వేసుకొని తిరుగుతున్నారు. ఆయన పర్యటించే చోట చుట్టుపక్కల షాపులు అన్నింటినీ మూసేయించి వ్యాపారుల కడుపులు కొడుతున్నారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారు పర్యటనలో ఉంటే ప్రజలకు అభివాదం చేసుకొని ముందుకు వెళ్తారు. మొన్న మోదీ గారు విశాఖ పర్యటనకు వచ్చినప్పుడు కూడా ప్రజలకు అభివాదం చేసుకుంటూ వెళ్లారు. ఏపీ ముఖ్యమంత్రి మాత్రం పరదాల చాటున దాక్కొని దాక్కొని వెళ్తారు. దొంగలు, దోపీడీదారులు, నేరగాళ్లతో లింకులు ఉన్నాయి కాబట్టే ప్రజల మధ్య ధైర్యంగా తిరగలేకపోతున్నారు. ప్రపంచ మత్స్యకార దినోత్సవాన్ని పురస్కరించుకొని మత్స్యకారులకు శుభాకాంక్షలు చెప్పాల్సిందిపోయి నరసాపురం వెళ్లి చెత్తవాగుడు వాగుతున్నారు. మత్స్యకారులు పడుతున్న ఇబ్బందులు తెలుసుకోవడానికి మత్స్యకార అభ్యున్నతి యాత్ర చేసింది జనసేన పార్టీ. వాళ్ల కష్టాలను వెలుగులోకి తెచ్చింది జనసేన పార్టీ. అధికారంలోకి వచ్చి మూడున్నరేళ్లు అయినా కనీసం మత్స్యకార గ్రామాల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించలేకపోయారు. తుపాన్ సమయంలో మత్స్యకారుల ఇళ్ళు దెబ్బ తింటే వాటిని పట్టించుకొనే దిక్కు లేదు. వేటకు 3 వేల లీటర్లు డిజీల్ అవసరమైతే… కేవలం 300 లీటర్లకు మాత్రమే తొమ్మిది రూపాయల చొప్పున సబ్సిడీ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. కనీసం వలల రిపేర్లకు ఇస్తామన్న రూ. 2 వేలు హామీకి దిక్కులేద”ని అన్నారు.
* ఏది రౌడీయిజమో ముఖ్యమంత్రే చెప్పాలి : అర్హంఖాన్
పొలిట్ బ్యూరో సభ్యులు అర్హం ఖాన్ మాట్లాడుతూ “ముఖ్యమంత్రి తన పరిధి దాటి ప్రవర్తిస్తూ.. మా పార్టీ అంతర్గత సమావేశాలు కూడా నిర్వహించుకోకుండా పోలీసు బలగాల సాయంతో అడ్డుకోవడం రౌడీయిజం. గుంతలమయంగా మారిన రోడ్లను మరమ్మతులు చేయకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాటడం రౌడీయిజం. ఇవన్నీ వదిలేసి ప్రజా సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తున్న జనసేన పార్టీని పట్టుకొని రౌడీసేన అని సంభోదించడం ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నాం. మైనారీటీల సంక్షేమం కోసం అనేక వాగ్ధానాలను మ్యానిఫెస్టోలో ప్రకటించారు. కానీ నేటి వరకు అమలుకు నోచుకోలేదు. వక్ఫ్ భూములు అన్యాక్రాంతం అవుతుంటే పట్టించుకునే నాథుడే లేడు. ఇలాంటి సమస్యలను లేవనెత్తడం, మైనారిటీల హక్కుల గురించి మాట్లడడం, ప్రజా సమస్యలపై పోరాటం చేయడం రౌడీయిజం అవుతుందా అనేది ముఖ్యమంత్రి గారే సమాధానం చెప్పాల”ని అన్నారు.