పురపాలక సంఘ సమావేశంలో తాగునీటి సమస్యపై గళమెత్తిన జనసేన కౌన్సిలర్లు

కోనసీమ, అమలాపురం పురపాలక సంఘ సాధారణ సమావేశం ఛైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్రమణి అధక్షతన కౌన్సిల్ సమావేశపు హలులో జరిగింది. సమావేశంలో అజెండాలో 34 అంశాలు, 12 అభివృద్ధి పనులకు 54 లక్షలు కేటాయించేన్దుకు కౌన్సిల్ ఆమోదం తెలిపింది. పట్టణంలో ఎన్ని నిధులు కేటాయించినా పట్టణ ప్రజలకు తాగు నీరు కల్పించడం లేదని జనసేన కౌన్సిలర్లు ప్రశ్నించారు. కమిషనరు విఐపిఐ నాయుడు పనులు జరుగుతున్నాయని సమాధానం తెలిపారు. 20వ వార్డు జనసేన కౌన్సిలర్ తిక్కా సత్యలక్ష్మి మాట్లాడుతూ… వార్డుల్లో ప్రజలు తాగు నీరు అడుగుతున్నారని, వారికి సమాధానము చెప్పలేక పోతున్నామని అన్నారు. మూడు ఏళ్ల క్రితం రూ.6కోట్లు విలువైన 111 పనులు, ఈ అజెండాలో పెట్టడం ఏమిటి అని ప్రశ్నించగా, ఆ పనులు ఇప్పుడు చేయించడం లేదని డిఈ అప్పలరాజు సమాధామిచ్చారు. 4వార్డు జనసేన కౌన్సిలర్ పడాల శ్రీదేవి కార్మికనగర్లో రూ 5లక్షలు విలువయిన పనులకు 19శాతం తక్కువకు టెండర్ వేస్తే ఎలా అనుమతి ఇచ్చారని ప్రశ్నించారు. మహిపాలవీధిలో తాగునీటి కోసం పైప్ లైన్లు వేసేందుకు నాలుగు విభాగాలుగా చేసి నిధులు కేటాయించారని 7వ వార్డు జనసేన కౌన్సిలర్ గండి దేవి హారిక నిలదీసారు. ప్రతిపక్ష కౌన్సిలర్లు వార్డుల్లో ట్యాంకర్లు పంపించడం లేదని ప్రతిపక్ష నేత, జనసేన 3వ వార్డు కౌన్సిలర్ యేడిద వెంకట సుబ్రహ్మణ్యం, జనసేన కౌన్సిలర్లు పిండి అమరావతి, గండి దేవిహారిక, తిక్కా సత్యలక్ష్మి, పడాలశ్రీ దేవి, గొలకోటి విజయలక్ష్మి కౌన్సిల్లో ప్రశ్నించారు. కౌన్సిలర్ లు ఎవరైనా వార్డుల్లో సమస్యలపై ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కారం అయ్యాక, వారి నుండి సమస్య పరిష్కారం అయినట్టు సంతకం తీసుకునే విధానం అమలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు పార్క్, డాక్టర్ మెట్ల సత్యనారాయణ రావు పార్కుల్లో పబ్లిసిటీ బోర్డులు అంశంపై 3వార్డ్ జనసేన కౌన్సిలర్ యేడిద వెంకట సుబ్రహ్మణ్యం ప్రశ్నించారు. 9వ వార్డు జనసేన కౌన్సిలర్ గొలకోటి విజయలక్మి మాట్లాడుతూ 9వ వార్డ్ కాటన్ స్ట్రీట్ లో పబ్లిక్ కుళాయి టాప్ విరిగి పోయిందని. వాటర్ వృధాగా పోయిందని ప్రజలు ఇబ్బందులు పడ్డారని, అధికారులకు చెప్పిన పట్టించుకోలేదని, వాటర్ ట్యాంకర్ లు కూడా సక్రమంగా రావడం లేదని అన్నారు.