మహాత్ముడు కలలు కన్న స్వరాజ్యం జనసేన తోనే సాకారం: మాకినీడి శేషుకుమారి

  • అహింసే ఆయుధంగా స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడు గాంధీ…!!

మహాత్మా గాంధి 153వ జయంతిని పురస్కరించుకుని ఆదివారం కాకినాడ జిల్లా పిఠాపురం టౌన్, గొల్లప్రోలు టౌన్ లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఇన్చార్జి శ్రీమతి మాకినీడి శేషుకుమారి మహాత్మా గాంధీ గారి విగ్రహం కు పూలమాలవేసి నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా శేషుకుమారి మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారతదేశానికి స్వతంత్రం సాధించిన నాయకులలో మహాత్మా గాంధీ అగ్రగన్యుడని. సత్యం, అహింస మార్గాలని ఆయుధాలుగా చేసుకుని స్వతంత్ర పోరాటానికై నడుం బిగించి… ఉప్పు సత్యాగ్రహం, సహాయ నిరాకరణ ఉద్యమం వంటి అనేక శాంతియుత పోరాటాలను చేసి భారతీయులను స్వతంత్ర ఉద్యమంలో ఏకం చేసి విదేశీ పాలన నుండి దేశానికి స్వతంత్రం సిద్ధింప చేయటానికి విశేషమైన కృషి చేశారని ఆయన గొప్ప సేవలు నేటి యువతకి స్ఫూర్తిదాయకమన్నారు. గ్రామాలే దేశానికి పట్టుకొమ్మలని గ్రామ స్వరాజ్యం వైపు నేతలు అడుగులు వేయాలని సూచించిన గొప్ప వ్యక్తి మహాత్మ గాంధీ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో. జిల్లా కార్యదర్శి మొగలి అప్పారావు, మండల ప్రెసిడెంట్ అమరాది వల్లి రామకృష్ణ, పుణ్యమంతుల మూర్తి, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ లు వేణు నారాయణరావు, కర్రీ కాశీ విశ్వనాథ్ , గోపు సురేష్, ఎంపీటీసీ అభ్యర్థి రాసంశెట్టి కన్యాకర్రావు రాచకొండ సత్యనారాయణ, జనసేన గ్రామ వైస్ ప్రెసిడెంట్ ఎనుగంటి హరిబాబు, మేళం బాబీ, బుర్రా సూర్య ప్రకాష్, వినుగొండ అమ్మజ్జి, గున్నబత్తుల రాంబాబు, పెనుపోతుల నాని బాబు, పసుపులేటి దుర్గాప్రసాద్, మిరియాల చిట్టి, దేశిరెడ్డి సతీష్, బావిశెట్టి నంది, పబ్బినీడి దుర్గాప్రసద్, తోట సతీష్, కంద సోమరాజు, కరెడ్ల రాజు, మేడిశేట్టి మణికంఠ, మత్స అప్పారావు,వల్లభశెట్టి మణి, చేదులూరి అర్జున్, ఏసుబాబు, వెలుగుల లక్ష్మణ్, కరపురెడ్డి మణికంఠ, రాయవరపు శివదుర్గ, పొన్నాడ మురళీకృష్ణ, షేక్ మస్తాన్ జనసైనికులు, వీరమహిళలు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.