ప్రజల ప్రాణానికి నష్టం జరిగే రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని నిలిపివేయాలి

  • గ్రామ వరద ముంపునకు గురిచేసే రైల్వే బ్రిడ్జి మాకు వద్దని గ్రామ ప్రజలు
  • అధికారులు వెంటనే స్పందించాలని జనసేన డిమాండ్

నెల్లూరు జిల్లా, కందుకూరు నియోజకవర్గం, ఉలవపాడు మండలం, సుబ్బారాయుడు సత్రం గ్రామం నందు నూతనంగా రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జిని ఏర్పాటు చేయడానికి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు మాకు ఎటువంటి సమాచారం అధికారులు ఇవ్వకుండా ఇక్కడ బ్రిడ్జిని ఏర్పాటు చేస్తున్నారు అంటూ గత రెండు రోజుల నుంచి గ్రామస్తులందరూ టెంటు వేసుకుని ఆందోళన చేయడం జరిగింది. గతంలో రైల్వే అధికారులకు ఈ సుబ్బరాయుడు సత్రం గ్రామ ప్రజలు రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వేసినట్లయితే అలుగులుపారి చెరువులుపారి నీరు ఎక్కువై బ్రిడ్జి కింద నీరు నిల్వ ఉండి, అంతేకాకుండా ఊరు మునిగిపోయి వరదల్లో కొట్టుకుపోయే అవకాశం ఉంది అని గ్రహించి ముందుగానే రైల్వే అధికారులకు అర్జీ ఇవ్వడం జరిగింది. గతంలో అర్జీ ఇచ్చినప్పటికీ దీనిపై ఎటువంటి విచారణ జరపకుండా ఆ గ్రామస్తుల అభిప్రాయాన్ని స్వేకరించకుండా ఈరోజు రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి పనులు మొదలు పెట్టడం దుర్మార్గపు చర్యలుగా ఆ గ్రామస్తులంతా భావిస్తున్నారు. ఇక్కడ అండర్ గ్రౌండ్ రైల్వే బ్రిడ్జిని నూతనంగా ఏర్పాటు చేయడం వలన, దాదాపు మూడు పంచాయతీలు 7000 మంది జనాభాకు ప్రాణ నష్టం ఉంది. రైల్వే ట్రాక్ ఆనుకొని చెరువులు ఉండటం వలన ప్రమాదం ముంచుకు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. గతంలో కూడా ఇక్కడ ఈ చెరువు తెగి లోతట్టు ప్రాంతాలు అవటం వలన ఎక్కువగా నీరు ఈ గ్రామంలో నిలువ ఉండటం జరిగింది. చుట్టూ అలుగులు చెరువులు ఉన్నందువలన అండర్ గ్రౌండ్ బ్రిడ్జి వేయడం వలన నిత్యం నీరు నిలువ ఉండే ప్రమాదం ఉంది. అంతేకాకుండా చెరువులు తెగిన అలుగురు పారిన ఈ బ్రిడ్జి కింద నుండి ఊరు ముంపునకు గురవుతుంది. కావున తక్షణమే అధికారులు వెంటనే స్పందించి ఈ గ్రామ ప్రజలకు ఎటువంటి ప్రాణా నష్టం జరగకుండా, ఆ గ్రామం నీటిమయం కాకుండా, బ్రిడ్జి పనులు ఆపివేసి, యధావిధిగా ఉంచి ఆ గ్రామ ప్రజలకు హామీ ఇవ్వవలసిందిగా లేనిపక్షంలో ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి సిద్ధంగా ఉన్నాము అనీ సింగరాయకొండ మండలం జనసేన పార్టీ అధ్యక్షులు ఐయినాబత్తిన రాజేష్ మరియు పొన్నలూరు మండలం జనసేన పార్టీ అధ్యక్షులు కనపర్తి మనోజ్ కుమార్, ఉలవపాడు మండల జనసేన పార్టీ నాయకులు లక్ష్మణ్ డిమాండ్ చేస్తూ ఈరోజు ఆ గ్రామ ప్రజలందరికీ మద్దతుగా నిలవడం జరిగింది. ఆ గ్రామ ప్రజలందరికీ జనసేన పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలియజేయడం జరిగింది.