గంగిరెద్దుకు క్యూఆర్​ కోడ్​.. ఇదీ డిజిటల్​ విప్లవం అంటే!

డిజిటల్ ఇండియాకు ఊత‌మిస్తూ ఆ దిశ‌గా దేశంలో ఎన్నో ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతున్నాయి. స్మార్ట్‌ఫోన్‌ల‌ను ప్ర‌తి ఒక్క‌రూ వాడుతుండ‌డంతో వాటిలోని యాప్‌ల‌తో డిజిటల్‌ పేమెంట్స్ బాగా పెరిగిపోయాయి.  పేటీఎం, గూగుల్‌ పే, ఫోన్‌ పే క్యూఆర్ కోడ్‌లు, వాటి వినియోగం వంటి వివ‌రాలు అంద‌రికీ తెలిసిపోయింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ వాటిని వాడుతున్నారు. దాదాపు అన్ని దుకాణాల వ‌ద్ద ఆ సౌక‌ర్యం ఉంటోంది.

ఈ నేప‌థ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పోస్ట్ చేసిన ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. గంగిరెద్దులాడించే వారు ఆ ఎద్దుపై  క్యూఆర్‌ కోడ్‌ ట్యాగ్‌ను అమర్చారు. దీంతో ఒక‌రు దాన్ని స్కాన్‌ చేసి గంగిరెద్దులాడించే వ్యక్తికి డ‌బ్బు సెండ్ చేశారు.  ఇది గంగిరెద్దులాట రికార్డెడ్ వీడియో అని, అందులో వారు క్యూఆర్‌ కోడ్‌ల ద్వారా భిక్ష తీసుకుంటున్నారని నిర్మ‌లా సీతారామ‌న్ చెప్పారు. దేశం డిజిటల్ చెల్లింపుల విప్లవం జానపద కళాకారుల వరకూ చేరిందని ఆమె కొనియాడారు.