వాణి ట్రాన్స్పోర్ట్ అధినేత ‘నా సేన కోసం నా వంతు’ కు యాభై వేల విరాళం

అనంతపురం, జనసేన అధినేత పిలుపుమేరకు పార్టీని బలోపేతం చేసేందుకు జనసేన పార్టీ ప్రతిష్టాత్మంగా ప్రారంభించిన ‘నా సేన కోసం నా వంతు’ కార్యక్రమంలో భాగంగా అనంతపురానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త వాణి ట్రాన్స్పోర్ట్ అధినేత గిరీష్ రూపాయలు యాభై వేల(50,000/-) రూపాయల చెక్కును అనంతపురం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు టిసి వరూణ్ కి, రాష్ట్ర కార్య నిర్వహణ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్ కి, జిల్లా నాయకులు గల్లా హర్షకి అందించడం జరిగింది. ఎంతో గొప్ప మనసుతో మీరు చేసిన ఈ విరాళం ఎంతో మందికి ఆదర్శం అని, జనసేన పార్టీ తరుపున, అధ్యక్షులు పవన్ కళ్యాణ్ తరుపున, జనసైనికుల తరపున గిరీష్ ధన్యవాదాలు తెలిపారు.