విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రి వున్నది..రోగులకా?..లేక రేపిస్టులకా…??:
వై ఎస్ జగన్ గారి పాలనలో మహిళలకు రక్షణ లేదు. మహిళలపై అత్యాచారాలు చేసే మృగాలకి రక్షణ ఎక్కువగా ఉంది. మతిస్థిమితం లేని మహిళపై 30 గంటల పాటు ముగ్గురు యువకులు మానభంగం.. దిశ చట్టం ఆంధ్రలో ఎక్కడ…3 రోజుల ముందే పోలీసులుకు పిర్యాదు చేసినా సరైన స్పందన లేని వైనం..హోం మంత్రి బాదితురాలిని, ఆమె తల్లి తండ్రులను పరామర్శించి సహాయం అందించడం కాదు.. ఇలాంటి సంఘటనలు జరగకుండా బలమైన చట్టాలు తెచ్చి వాటిని అమలు చేయటం చేయాలి.. దిశ చట్టం ఆంధ్రలో ఎక్కడ పని చేస్తోంది.. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తుందో సమాదానం చెప్పాలని దారం అనిత డిమాండ్ చేశారు.