సిఐ ని సన్మానించిన వింజమూరు మండల జనసేన
నెల్లూరు జిల్లా, వింజమూరు మండల జనసేన పార్టీ తరఫున అవార్డు గ్రహీత సిఐ ని వింజమూరు మండల జనసేన అధ్యక్షులు బండారు వెంకట సత్యనారాయణ ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షులు వెంకట సత్యనారాయణ మాట్లాడుతూ సిఐ కరోనా టైంలో కూడా వాళ్ల ప్రాణాలు సైతం తెగించి డ్యూటీ చేస్తున్నారు. సిఐ ఇటువంటి అవార్డులు రివార్డులు ఎన్నో సాధించి డి.ఎస్.పి, ఎస్పి ప్రమోషన్లు పొందాలని జనసేన పార్టీ తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అలాగే ఎస్సై అయినటువంటి జంపని కుమార్ ని కూడా సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఉదయగిరి నియోజకవర్గం నాయకులు కమతం శ్రీను, మండల నాయకులు జిల్లాల రాజా, కొండలరావు, ఉపాధ్యక్షులు సాయితేజ్, సుభాని, ప్రధాన కార్యదర్శి భువనేశ్వర్, విజయ్, భువనేశ్వరం రవి, జనసేన నాయకులు, జనసేన కార్యకర్తలు పాల్గొనడం జరిగింది.


