వైఎస్ఆర్సిపికి ఎందుకు అవకాశం ఇవ్వాలి?: ఎం హనుమాన్

విజయవాడ: 2024లో వైఎస్ఆర్సిపికి ఎందుకు అవకాశం ఇవ్వాలని జనసేన రాష్ట్ర బీసీ నాయకులు మరియు న్యాయవాది ఎం హనుమాన్ ప్రశ్నించారు. వైఎస్ఆర్సిపికి మళ్ళీ అవకాశం ఇస్తే రాష్ట్రాన్ని ఇంకా దోచుకుంటారని, ప్రజల్ని ఇంకా ఎన్ని ఇబ్బందులకు గురిచేస్తుందోనని ఎద్దేవా చేసారు. ఈ సందర్భంగా వైఎస్ఆర్సిపికి పలు ప్రశ్నలు సందించారు.. సిపిఎస్ రద్దు అని చెప్పి ఉద్యోగాలను మోసం చేసినందుకా..?, మీకు కమిషన్ ఇవ్వలేదని చెప్పి జాకీ అమరాజా కంపెనీలను పక్క రాష్ట్రానికి పంపించినందుకా..?, దేవాలయాల్లో దేవదయ శాఖ డబ్బులు దోచుకోవడానికి అవకాశం ఇవ్వాలా..?, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ జాబ్ నోటిఫికేషన్ అని చెప్పి యువతని మోసం చేసినందుకు అవకాశం ఇవ్వాలా?, లేకపోతే పోలవరం ఇంకొక ఐదు సంవత్సరాలు ముందుకు జరిపినందుకు అవకాశం ఇవ్వాలా?, మన దేశంలో ధనవంతులు జాబితాలో ఉన్న సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రపంచ ధనవంతుల జాబితాలో చేర్చడానికి అవకాశం ఇవ్వాలా ?, రిషికొండ లాగా ఇంకా అన్ని కొండల్ని భూమికి కబ్జా చేయడానికి అవకాశం ఇవ్వాలా?, రోడ్లు వెయ్యనందుకు అవకాశం ఇవ్వాలా ?, నిత్యావసరకులు ధరలు పెంచినందుకు అవకాశం ఇవ్వాలా ?, గంజాయి స్మగ్లింగ్ చేస్తూ యువతని గంజాయి మత్తులో ముంచినందుకు అవకాశం ఇవ్వాలా?, మద్యపానం నిషేధం అని చెప్పి సొంత బ్రాండ్లతో జగన్మోహన్ రెడ్డి ఖజానాని నింపినందుకు అవకాశం ఇవ్వాలా?, రౌడీయిజం చేసినందుకు అవకాశం ఇవ్వాలా, వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే 25 లక్షలు ఇల్లు ఇస్తానని చెప్పి 3.5 అయినా కనీసం 10% కూడా పేదలకు ఇల్లు కేటాయించినందుకు అవకాశం ఇవ్వాలా ??, యువతని నమ్మించి మోసం చేసి ఉద్యోగాలు కల్పిస్తానని చెప్పి మద్యం దుకాణంలో చాపల దుకాణంలో చేసే ఉద్యోగాలు ఇచ్చినందుకు మీకు అవకాశం ఇవ్వాలా? అంటూ.. 2024లో మీకు అవకాశం ఇస్తే ఇంకా ఎంత దోచుకుంటారని జనసేన తరపున ఎం హనుమాన్ ప్రభుత్వాన్ని నిలదీసారు.