ఎన్.డి.ఏ కూటమిని గెలిపించండి: బర్మా ఫణి బాబు
నూజివీడు నియోజకవర్గం: ముసునూరు మండలంలోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు నూజివీడు ఉమ్మడి అభ్యర్ధి పార్ధసారధి, ఏలూరు పార్లమెంటు అభ్యర్ధి పుట్టా మహేష్ కుమార్ గారి గెలుపు కోసం గ్రామాల్లో జనసేన నాయకులను, కార్యకర్తలను కలుస్తూ జరిగిన ప్రచార కార్యక్రమంలో నూజివీడు నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బర్మా ఫణి బాబు పాల్గొన్నారు. ఆయన మాట్లాడు ప్రతి ఒక్కరూ కూడా ఎన్నికల పోలింగ్ కేంద్రాల్లో రెండు ఓట్లు కూడా సైకిల్ గుర్తు మీద వేసి అటు ఎమ్మెల్యే గా పార్థ సారథి గారిని, ఇటు ఎంపీ అభ్యర్థిగా మహేష్ గారిని గెలిపించి నూజివీడు అబివృద్దికి భాగస్వామ్యం కావాలని కోరారు. ఆయనతో పాటు నియోజకవర్గ జనసేన నాయకులు,పార్టీ సెంట్రల్ ఆంధ్ర జోన్ కమిటి సభ్యులు పాశం నాగబాబు, నాయకులు తోట వెంకట్రావు, సూరిశెట్టి శివ, బళ్ల వీరాస్వామి, బొక్కినాల రాజు పాల్గొన్నారు ఈ ప్రచార కార్యక్రమాల్లో గ్రామ టీడీపీ పార్టి నాయకులు, స్థానిక జనసేన, టీడీపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.