రాజోలు జనసేన ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలు

రాజోలు, అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా జనసేన వీరమహిళల ఉలిశెట్టి అన్నపూర్ణ ఆద్వర్యంలో జనసేన పార్టీలో విజయం సాధించిందిన ఎంపిటిసిలు, వార్డ్ మెంబర్ లను సత్కరించి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాజోలు ఎంపిటిసి దార్ల కుమారి లక్ష్మి కేక్ కట్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా రాజోలు జనసేన పార్టీ మండల అధ్యక్షులు సూరిశెట్టి శ్రీనివాసరావు పాల్గొని వీరమహిళలకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామశాఖ అధ్యక్షులు కాట్నా రాజు, రావురి నాగబాబు, సాదనాల నాగలక్ష్మి, చింతా వీరమణి, పాటి సుదా, సుంకర కృష్ణ కుమారి, ఉలిశెట్టి వేణు, అశం ఆదిలక్ష్మి, ఆకుల మహాలక్ష్మి, సుర్యవతి, నాగమణి, శాంతి మరియు జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.