కులాలను వేరు చేసి మాట్లాడే ప్రభుత్వం వైసీపీ మాత్రమే.. గంగులయ్య

అల్లూరి జిల్లా, పాడేరు జనసేన కార్యాలయంలో జి.ముంచంగిపుట్టు, పంచాయితి కావురాయి, లింగపుట్టు గ్రామయువతతో గురువారం జరిగిన సమావేశంలో రాష్ట్రంలో అధిక జనాభా కలిగిన బోయా వాల్మీకి, బెంతు ఒరియాలను ఎస్టీ జాబితాలో చేర్చడం వంటి కుతంత్రాలు విరమించుకోవాలని, వైసీపీ ప్రజాప్రతినిధులు గిరిజనులకు ద్రోహం చేసే చర్యలను మానుకోవాలని, లేదంటే యావత్ గిరిజన జాతి దృష్టిలో జాతి ద్రోహులుగా మిగిలి పోతారని జనసేన పార్టీ హెచ్చరిస్తోంది. మీ తాత్కాలిక అవసరాలకోసం జాతి మనుగడ దెబ్బతీస్తోంది, వైసీపీ ప్రభుత్వం యొక్క గిరిజన వ్యతిరేక చర్యలను కండిస్తూ ఈ ఆలోచన విరమించాలని లేని పక్షమున వైసీపీ పార్టీ రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటుందని ఈ సందర్బంగా హెచ్చరిస్తున్నామని తెలిపారు. అలాగే ఎస్టీ, ఎస్సీ సబ్ ప్లాన్ నిధులు దుర్వినియోగం అంశంపై అవగాహనలో భాగంగా ఈ సదస్సులో జనసైనికులనుద్దేశించి, రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజాపాలన జరగట్లేదు ఆదివాసీ ప్రాంతాల్లో ప్రజరవాణా వ్యవస్థ, ప్రజారోగ్య వ్యవస్థ, విద్యాశాఖ హాస్టల్ వసతి నిర్వహణ వ్యవస్థ, ఉపాధి కల్పన వ్యవస్థ ఇలా అనేక రంగాల్లో మనం వెనక బాటుకు గురౌతున్నాం. కారణం ఏదైనా మన ప్రజాప్రతినిధుల వైఫల్యం బాగా కనపడుతుంది. ఇలా నిస్సిగ్గుగా ఇంకా అభివృద్ధికి నోచుకోకుండా ఇంకో 75 సంవత్సరాలు గడిపెద్దామా లేదంటే యువత, రైతు సాధికారత, మహిళ సాధికారతను బలంగా కోరుకునే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇచ్చేవిదంగా మారుమూల పల్లెల్లో సైతం జనసేనపార్టీని విస్తృతంగా బలోపేతం చేయాలని, జనసైనికులనుద్దేశించి తెలిపారు. ఈ సమావేశంలో పాడేరు మండలఅధ్యక్షులు నందోలి మురళి కృష్ణ, సీదారి సన్నిబాబు, సాలేబు అశోక్ కొర్ర రాంబాబు, మాదేలి నాగేశ్వరరావు, వంతల ఈశ్వర్ నాయుడు, సోమరాజు జి.మాడుగుల నాయకులు మసాడి సింహాచలం, తల్లే త్రీమూర్తులు, టీవీ రమణ, చందు తదితర జనసైనికులు పాల్గొన్నారు.