వైసీపీ నాయకులవి బ్రిటీషర్ల ఆలోచనలు

• విభజించు పాలించు సిద్ధాంతం అమలు చేస్తున్నారు
• కులాల మధ్య చిచ్చుపెట్టి లబ్ధి పొందాలన్నదే వైసీపీ లెక్క
• ఐటీ పాలసీ గురించి మాట్లాడాల్సిన మంత్రికి కులాలతో ఏం సంబంధం
• అన్ని వర్గాలు వైసీపీని వర్గ శత్రువుగా చూస్తున్నాయి
• ముఖ్యమంత్రి కులానికి మంత్రి అమర్నాథ్ బంట్రోతు ఉద్యోగం చేస్తున్నారు
• రాష్ట్రం నుంచి రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు తరలిపోయాయి
• రాష్ట్రంలో 32 లక్షల మంది నిరుద్యోగులుంటే.. 2 వేల ఉద్యోగాలిచ్చామని గొప్పలుపోతున్నారు
• ప్రజల డైరక్షన్లో ప్రజలకోసం పనిచేసే నాయకుడు పవన్ కళ్యాణ్
• మీడియా సమావేశంలో జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

విజయవాడ, వైసీపీ నాయకుల్లో బ్రిటీష్ రక్తం ప్రవహిస్తోందని… వారి ఆలోచనలు, పని తీరు మొత్తం కులాల మధ్య చిచ్చు పెట్టు.. విభజించి పాలించు అనే ధోరణిలో ఉన్నాయని జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపించారు. బ్రిటీష్ డీఎన్ఏ ఎక్కించుకున్న వైసీపీ పార్టీ కులాల మధ్య గొడవలు పెట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తోందన్నారు. కమ్మ, కాపుల మధ్య చిచ్చుపెట్టేందుకు మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని తెలిపారు. పెట్టుబడులు, ఐటీ పాలసీల గురించి మాట్లాడాల్సిన మంత్రి కులాల గురించి మాట్లాడడం ఏంటని నిలదీశారు. మంత్రి పదవి చేపట్టిన 150 రోజుల్లో ఆయన 150 మందికైనా ఉద్యోగాలు ఇచ్చారా? అని ప్రశ్నించారు. జనసేన పార్టీ కులాల్ని కలపాలి, మతాల్ని గౌరవించాలనే సిద్ధాంతం మీద ముందుకు వెళ్తుందన్నారు. రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా స్పందించే ఏకైక నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్న సంగతి గుర్తు పెట్టుకుని మాట్లాడాలని హితవు పలికారు. బుధవారం విజయవాడ వన్ టౌన్ లోని జనసేన పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పోతిన మహేష్ మాట్లాడుతూ “జనసేన పార్టీ అంటే ఒక మార్పుకి సంకేతం. పవన్ కళ్యాణ్ సమాజంలో మార్పు కోసం.. అన్ని కులాలు, మతాల్ని కలిపి ఉంచాలని నిత్యం తపన పడతారు. అంతా బాగుండాలని కోరుకుంటారు. కష్టాల్లో ఉన్న ప్రజల కన్నీరు తుడిచే లక్ష్యంతో పని చేస్తారు. పవన్ కళ్యాణ్ కేవలం ప్రజల డైరెక్షన్ లోనే ప్రజల కోసం పని చేస్తారు. మరెవరి డైరెక్షన్ లోనూ పని చేయరు. సామాజికవర్గాల మధ్య చిచ్చు పెట్టి.. ప్రజల మధ్య అడ్డుగోడలు కట్టి.. కొన్ని కులాలను వర్గ శత్రవులుగా మార్చేందుకు ఆయన పార్టీ పెట్టలేదు. ఏరోజూ కూడా ఆ విధంగా పార్టీని ముందుకు తీసుకువెళ్లలేదు. మాలాంటి బలహీన వర్గాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చిన పార్టీ జనసేన పార్టీ.

• వైసీపీ నాయకులే అమర్నాథ్ రెడ్డి అని పిలుస్తున్నారు
ఒక సామాజిక వర్గాన్ని వర్గ శత్రువుగా చూపి రాష్ట్ర అభివృద్ధిని సర్వనాశనం చేసిన పార్టీ వైసీపీ. ముఖ్యమంత్రి శ్రీ జగన్ రెడ్డి. వారి దుర్మార్గపు పాలన వల్ల ఆ పార్టీని అన్ని సామాజిక వర్గాలు శత్రువుగా భావిస్తున్నాయి. బీసీలకు 10 శాతం రిజర్వేషన్లు తీసేసినందుకు, 18 వేల మంది బీసీ సోదర సోదరీమణులకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేకుండా చేసినందుకు వైసీపీని బీసీలు శత్రువుగా భావిస్తున్నారు. ఎస్సీ ఎస్టీల రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాన్ని వారి మీదే ప్రయోగిస్తున్నందుకు ఆ రెండు వర్గాలు వైసీపీని శత్రువుగా చూస్తున్నారు. ముస్లింల దర్గా మాన్యాలు, వక్ఫ్ బోర్డు మాన్యాలు కాజేయడంతోపాటు ఆ వర్గాల మీద అనేక రకాలుగా దాడులు చేస్తున్నందుకు మైనారిటీలు ఆ పార్టీని శత్రువుగా భావిస్తున్నారు. ప్రజల్ని పక్కదారి పట్టించాలి. కాపు, కమ్మ కులాల మధ్య చిచ్చుపెట్టాలనే ఉద్దేశంతోనే మంత్రి గుడివాడ అమర్నాథ్ ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు. వైసీపీ నాయకులే అతన్ని అమర్నాథ్ రెడ్డి అని పిలుస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వర్గం వద్ద బంట్రోతు పని చేస్తున్నందునే నిన్ను ప్రజలు ఆ కులానికి చెందిన వ్యక్తిగా భావిస్తున్నారు. నా పేరు గుడివాడ అమర్నాథ్ అని మీటింగులు చెప్పుకున్న మాట వాస్తవం కాదా? రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి.

• రికార్డింగు డాన్సులకే పనికొస్తారు

మంత్రిగా అమర్నాథ్ రెడ్డి ఐటీ పాలసీ గురించి మాట్లాడాలి.. మంత్రి అయిన తర్వాత 150 రోజుల్లో కనీసం ఒక్కసారైనా ఐటీ పాలసీ గురించి మాట్లాడారా? రాష్ట్రానికి ఎన్ని కోట్ల పెట్టుబడులు తెచ్చారు? ఎన్ని పరిశ్రమలు తెచ్చారు? సేవా రంగాన్ని ఎంత అభివృద్ధి చేశారు? ఎంత మందికి ఉద్యోగాలు ఇచ్చారో గుడివాడ అమర్నాథ్ రెడ్డి చెప్పాలి? మీకు పదవి వచ్చిన 150 రోజుల్లో 150 ఉద్యోగాలిచ్చారా? అతగాడు రికార్డింగ్ డాన్సులు, ఎడ్ల బండ్ల మీద స్టెప్పులు వేయడానికి తప్ప మీరు మంత్రిగా పనికిరారన్న సంగతి రాష్ట్ర ప్రజలకు అర్ధం అయిపోయింది.

• ముఖ్యమంత్రి సమీప బంధువుల వీడియోలు బయటకు రావు

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మీద విమర్శలు చేసే ముందు జగన్ రెడ్డి మొన్నటి ఢిల్లీ పర్యటనలో ఏ సామాజికవర్గం నాయకులతో గదుల్లో కూర్చుని భోజనం చేశారో తెలుసుకోండి. మిగిలిన సామాజకవర్గాల ఎంపీలు దణ్ణాలు పెడుతూ గుమ్మం బయట నిలబడలేదా? దీనికి వైసీపీ ఏం నేతలు సమాధానం చెబుతారో చెప్పండి. కేవలం ముఖ్యమంత్రి సామాజికవర్గం నాయకులు మాత్రమే ఆయనతో గదిలో కూర్చుంటే.. మిగిలిన ఎంపీలు బయట నిలబడి ఆత్మవంచన చేసుకున్న మాట వాస్తవం కాదా? నీలి చిత్రాల వీడియోలు కాపులవి, కురబలవే బయటకు వస్తున్న మాట వాస్తవం కాదా? అంబటి, అవంతి, మాధవ్ లవి మాత్రమే ఎందుకు బయటకు వస్తున్నాయి. విశాఖలో తిరుగుతున్న నెల్లూరు తాత వీడియోలు ఎక్కడైనా బయటకు వచ్చాయా? తాడేపల్లిలో ఉండే ముఖ్యనేత.. మహిళల పట్ల ఆయనకుండే బలహీనతలు ఎక్కడైనా బయటకు వచ్చాయా? ముఖ్యమంత్రి గారి సమీప బంధువులవి అయితే బయటకు రావా? దీని మీద ఎవరూ మాట్లాడరా? కాపులు, కురబల మీద బురద చల్లుతారు. ముఖ్యమంత్రి సమీప బంధువులవి అయితే బయటకు రాకుండా జాగ్రత్తపడతారా? ఇదెక్కడి న్యాయం. దమ్ముంటే దీని మీద మాట్లాడండి. వైసీపీ అనే ఒక దుర్మార్గమైన పార్టీకి కొమ్ముకాస్తే చివరికి బలయ్యేది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలే.

• జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని చూసి భయపడుతున్నారు
రాష్ట్రంలో ఏ సమస్య వచ్చినా స్పందిస్తున్న ఒకే ఒక్క నాయకుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారు. గత నాలుగు నెలలుగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి మీద వైసీపీ విమర్శలు, దాడులు పెరిగిపోయాయి. ఆవిర్భావ సభ విజయవంతం కావడం, కౌలు రైతు భరోసా యాత్ర, జనవాణి కార్యక్రమాలకు అపూర్వ ఆదరణ రావడంతో… భయం పుట్టి వైసీపీలో వణుకు మొదలైంది. ప్రజా సమస్యల పరిష్కారం కోసం పవన్ కళ్యాణ్ నిత్యం ప్రజల్లో మమేకమవుతున్నారు. జనసేనానికి ఆదరణ పెరిగిందని సర్వేలు చెబుతుంటే వైసీపీ నేతలు భయపడుతున్నారు. కులాల మధ్య చిచ్చు పెడితే ఆ కాష్టంలో కాలిపోయేది వైసీపీయేనని ఆ పార్టీ నేతలు గుర్తు పెట్టుకోవాలి.

• అన్నింటా అగ్రతాంబూలం ఆయన కులానిదే కాదా?

మంత్రి అమర్నాథ్ మరో మాట సెలవిచ్చారు. జగన్ రెడ్డి పెట్టుబడులు బాగా తెచ్చారంట.. 2 వేల ఉద్యోగాలు వచ్చాయంట.. రాష్ట్రంలో 32 లక్షల మంది నిరుద్యోగులు ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇచ్చిన ఉద్యోగాలు కేవలం 2 వేలు మాత్రమే. మూడేళ్లలో రాష్ట్రం నుంచి పారిపోయిన పరిశ్రమలు, పెట్టుబడులు ఎంతో తెలుసా? సేవారంగం ఎంత నష్టపోయిందో తెలుసా? వీటన్నింటి మీదా వైసీపీ ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలి. మూడేళ్లలో రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు రాష్ట్రం నుంచి ఇతర రాష్ట్రాలకు మరలిపోయిన మాట వాస్తవం కాదా? ఉద్యోగాలు లేక చాలా మంది ఇతర రాష్ట్రాలకు వలస పోయిన మాట వాస్తవం కాదా? ఈజ్ ఆఫ్ డూయింగ్, డెవలప్మెంట్ ఇండికేటర్లు పట్టించుకోకుండా.. దోచుకోవడం, రాజకీయ ప్రత్యర్ధుల మీద కక్ష సాధింపుల కారణంగా ఎన్నో పెట్టుబడులు రాష్ట్ర విడిచి వెళ్లిన మాట వాస్తవం కాదా? ఏషియన్ పల్ప్, అధానీ డేటా సెంటర్, లులూ గ్రూప్, కియా అనుబంధ పరిశ్రమలు వెళ్లిపోయిన మాట వాస్తవం కాదా? రాష్ట్రంలో సింగపూర్ స్టార్టప్ కంపెనీలు ఎక్కడున్నాయి? 150 రోజులు మంత్రిగా ఉండి కనీసం 150 మందికి ఉద్యోగాలివ్వలేని మీరు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడతారా? మీకు సిగ్గుందా? రూ. 10 లక్షల కోట్ల పెట్టుబడులు ఇతర రాష్ట్రాలకు తరలిపోతే దాని గురించి మాట్లాడకుండా జనసేన గురించి, కులాల గురించి మాట్లాడడం దారుణం. నామినేటెడ్ పదవుల్లో 80 శాతం ముఖ్యమంత్రి సామాజికవర్గానికి ఇచ్చిన మాట వాస్తవం కాదా? దాని గురించి మాట్లాడే దమ్ము మీకుందా? యూనివర్శిటీల్లో 12 మంది వైస్ ఛాన్సలర్ పోస్టులు ఉంటే పది సీఎం సామాజికవర్గానికి ఇచ్చుకున్న మాట వాస్తవం కాదా? 8 విప్ పదవుల్లో నాలుగు ఆయన వర్గానికి ఇచ్చుకోలేదా? యూనివర్శిటీ ఈసీ మెంబర్లు, వ్యవసాయ కమిషన్లో, ప్రైవేటు వర్శిటీల్లో ఆయన సామాజవర్గానికి అగ్రతాంబూలం వాస్తవం కాదా?

•మోసపోయిన రెడ్లకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలబడతారు

మన వాడే కదా అని రాయలసీమ రెడ్లు జగన్ రెడ్డికి మద్దతు ఇచ్చారు. ఈరోజున నష్టపోయిన వారిలో కూడా ఎక్కువ మంది రెడ్డి సామాజకవర్గం వారే ఉన్నారు. బయటకు చెప్తే ప్రాణం పోతుంది చెప్పకపోతే మానం పోతుందని వారంతా మధనపడుతున్నారు. వైసీపీ పాలకుల చేతిలో మోసపోయిన రెడ్డి సామాజికవర్గానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అండగా నిలబడతారు. కాపు సామాజికవర్గంలో పుట్టి కాపుల్ని అమ్మేస్తున్న గుడివాడ అమర్నాథ్, అంబటి రాంబాబు, దాడిశెట్టి రాజా, పేర్ని నానిలు కాపు కుల ద్రోహులు. పదే పదే కులాల మధ్య చిచ్చు పెట్టి మీరు కాపు సామాజిక వర్గాన్ని ఎవరికి అమ్ముతున్నారో సమాధానం చెప్పాలి. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తో కలసి నడవడానికి అన్ని వర్గాల ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాపుల్లో మెజారిటీ వర్గం జనసేనానికి అండగా ఉన్నారన్న విషయం వైసీపీకి తెలిసే కులాల మధ్య చిచ్చుపెడుతూ ఉన్నారు. ఆ పని మానకుంటే అన్ని వర్గాల ప్రజలు మిమ్మల్ని పాతేసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే రోజుల్లో జనసేన పార్టీయే గేమ్ ఛేంజర్ అని తెలిపారు.