ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా.. ఢిల్లీ గడ్డపై కాషాయ జెండా

ఢిల్లీ ముఖ్యమంత్రి ఎవరో అనే ఉత్కంఠ వీడింది. ఎట్టకేలకు బీజేపీ అధిష్టానం ఢిల్లీ సీఎం ఎవరనేది ఎంపిక చేసింది. మొదటి నుంచి ప్రధాన రేసులో ఉన్న రేఖా గుప్తానే ఢిల్లీ సీఎంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు బీజేపీ అధిష్టానం నిర్ణయించి ఆమె పేరును ప్రకటించింది. ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా రేఖా గుప్తా గురువారం బాధ్యతలు చేపట్టనున్నారు. అతిరథ మహారథులు హాజరుకానున్న ఈ కార్యక్రమానికి ఇప్పటికే భారీ స్థాయిలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. రామ్‌ లీలా వేదికగా రేఖా గుప్తా ఢిల్లీ సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నారు.

ఢిల్లీ నూతన సీఎంగా రేఖా గుప్తాను బీజేపీ అధిష్టానం ప్రకటించింది. బీజేఎల్పీ సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. సీఎం రేసులో ఉన్న పర్వేష్‌ వర్మకు ఉప ముఖ్యమంత్రిగా పదవి కట్టబెట్టనున్నారు. షాలిమార్‌భాగ్‌ నుంచి  రేఖా గుప్తా ఎమ్మెల్యేగా గెలిచారు. రేపు మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాలకు ఢిల్లీ సీఎంగా రేఖా గుప్తా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సీఎంతో పాటు మరో ఆరుగురు మంత్రుల ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలుస్తోంది.

Share this content: