పండుగలు, ఆచార వ్యవహారాలు, సంస్కృతి సంప్రదాయాలు, కళలు… జాతిని సజీవంగా నిలుపుతాయి. మన ముంగిళ్లకు వచ్చిన ‘ఉగాది’ తెలుగువారి వారసత్వపు పండుగ. విశ్వావసు అనే గంధర్వుడు పేరుతో వచ్చిన ఈ ఉగాది పండుగ తరుణాన తెలుగు ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతూ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ ఒక ప్రకటన విడుదల చేశారు. జీవితం కష్టసుఖాల సమ్మేళనం. మన ఉగాది పచ్చడిని అందుకు సంకేతంగా భావిస్తాము. గత ప్రభుత్వ పాలన కష్టాలమయమైపోగా – ఇప్పుడు ప్రజలకు సుఖాలను అందించే మంచి పాలన ఆంధ్రప్రదేశ్ లో ప్రజల ముంగిటకు వచ్చింది. చైత్ర మాసపు శోభతో వసంతాన్ని మోసుకువచ్చిన శ్రీ విశ్వావసు నామ ఉగాది… తెలుగు లోగిళ్ళను సిరిసంపదలతో పచ్చగా ఉంచాలని మనస్పూర్తిగా ఆకాంక్షిస్తున్నానని శ్రీ పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు.
Share this content:
Post Comment