నిరాడంబరతకు నిలువుటద్దం!
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కల్యాణ్ గారు మంగళగిరిలోని తన నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు శ్రీ చంద్రబాబు నాయుడు గారికి ఈ రోజు లేఖ రాశారు. విజయవాడలో విశాలమైన భవనాన్ని (ఇరిగేషన్ భవనం) క్యాంపు కార్యాలయంగా కేటాయించినందుకు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శ్రీ పవన్ కల్యాణ్ గారు కృతజ్ఞతలు తెలియచేశారు. అయితే మంగళగిరిలోని నివాసాన్ని క్యాంపు కార్యాలయంగా వినియోగించుకోనున్న క్రమంలో విజయవాడలో కేటాయించిన భవనాన్ని, ఫర్నిచర్ తో సహా వెనక్కి తీసుకోవలసిందిగా ఆ లేఖలో విజ్ఞప్తి చేశారు.