సామాజిక, రాజకీయ ఉత్తేజానికి ప్రతీక ఉత్తరాంధ్ర

• శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి కె. నాగబాబు
సామాజిక, రాజకీయ అంశాల్లో పోరాటానికి, ఉత్తేజానికి ప్రతీక ఉత్తరాంధ్ర ప్రజానీకం అని శాసన మండలి సభ్యులు, జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీ కె. నాగబాబు గారు స్పష్టం చేశారు. ఉత్తరాంధ్ర పర్యటనలో భాగంగా ఆదివారం నెల్లిమర్లలో శ్రీకాకుళం జిల్లా, విజయనగరం జిల్లా నాయకులతో, నెల్లిమర్ల నియోజకవర్గ నాయకులతో శ్రీ నాగబాబు గారు ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా ఉత్తరాంధ్రలో పార్టీ కార్యకలాపాలను గురించి, స్థానిక స్థితిగతులను గురించి అడిగి తెలుసుకున్నారు. ఉత్తరాంధ్రలో పార్టీ అభివృద్ధి కోసం ప్రతీ ఒక్కరూ నిస్వార్థంగా కృషి చేయాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
• ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకి అభినందనలు
ఈ సందర్భంగా ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడుకి నాగబాబు ప్రత్యేక అభినందనలు తెలిపారు. దేశంలోనే రెండవ అత్యున్నత శౌర్య పురస్కారానికి ఎంపికైన తెలుగు రైతు బిడ్డ, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఆర్మీ మేజర్ మల్లా రామ్ గోపాల్ నాయుడు దేశం కోసం ఎంతో సాహాసోపేతమైన ఆర్మీ ఆపరేషన్స్ లో పాలుపంచుకున్నారని ప్రశంసించారు.

image-19-1024x682 సామాజిక, రాజకీయ ఉత్తేజానికి ప్రతీక ఉత్తరాంధ్ర

Share this content:

Post Comment